ఒక్క ఛాన్స్ తో ప్రజల మెప్పు పొందలేకపోయిన జగన్.. 10 శాతం స్థానాల్లో సైతం గెలవలేదుగా!
ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలని జగన్ భావించగా కనీస అవసరాలు సైతం తీర్చలేకపోవడంతో ప్రజలు మాత్రం జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రయాణం చేయడానికి సరైన రోడ్లు కూడా లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావనే చెప్పాలి. జగన్ ఐదేళ్లలో ఎంత దారుణంగా పాలించి ఉంటే కనీసం 10 శాతం స్థానాల్లో కూడా పార్టీకి విజయం దక్కలేదో సులువుగా అర్థమవుతుంది.
ప్రధానంగా అర్బన్ ఓటర్ల మెప్పు పొందే విషయంలో జగన్ ఫెయిల్ కావడం వల్లే ఆయనకు, ఆయన పార్టీకి ఈ పరిస్థితి అని చాలామంది భావిస్తారు. జగన్ కు పదుల సంఖ్యలో సలహాదారులు ఉన్నా ఆ సలహాదారులు ఏం సలహాలు ఇచ్చారో అర్థం కావడం లేదనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. జగన్ ఇప్పటికైనా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.
జగన్ లో మార్పు రాకపోతే పార్టీ రాబోయే రోజుల్లో సైతం పుంజుకోవడం సులువు కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీని రాబోయే రోజుల్లో నిలబెట్టడంలో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. జగన్ సరైన వ్యూహకర్త కోసం వెతుకుతున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. జగన్ తండ్రిలా పాలనలో మార్క్ చూపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చాలామంది భావిస్తారు.