జంపింగ్ జపాంగ్ హీరోలు: ఏడాదికో పార్టీ... కొండా సురేఖ రూటే సెపరేట్
* 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా విజయం
* 2009లో వైయస్సార్ కేబినెట్లో మంత్రిగా ఛాన్స్
* వైయస్సార్ మరణం తర్వాత వైసీపీలోకి కొండా సురేఖ
* తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీలు గూటికి కొండా
* 2018లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన కొండా సురేఖ
రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది రాజకీయ నాయకులు... రకరకాల పార్టీలలో కొనసాగుతున్నారు. తమ రాజకీయ జీవితం ఒక పార్టీ నుంచి ప్రారంభించి ఆ తర్వాత రాజకీయ అవసరాల కోసం వేరే పార్టీలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా అధికారం ఎవరి దగ్గర ఉంటే వారి.. పదవులను అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో కొండా సురేఖ ఒకరు. 1995 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు కొండా సురేఖ.
అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో వీర విధేయురాలిగా పనిచేశారు కొండా సురేఖ. ఇక ఈ నేపథ్యంలోనే 1999 సంవత్సరంలో శాయంపేట నియోజకవర్గం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. అప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో కొండా సురేఖకు తిరుగులేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను కూడా అనుభవించారు కొండా సురేఖ.
ఇక 2004 సంవత్సరంలో రెండోసారి శాయంపేట నుంచి విజయం సాధించడం జరిగింది. 2009 సంవత్సరంలో పరకాల నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి కొండా సురేఖ విజయం సాధించడం జరిగింది. ఆ సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్లో కొండా సురేఖకు చాన్స్ ఇవ్వడం జరిగింది.
అయితే దురదృష్టవశాత్తు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీ పార్టీలో చేరారు. అయితే వైసీపీ పార్టీలో చేరిన తర్వాత పరకాల నుంచి మళ్లీ... పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అంటే 2013 సంవత్సరంలోనే కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు కొండా సురేఖ. టిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి... కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొండ సురేఖ.