హోం మంత్రిత్వ శాఖపై పవన్‌కు నో ఇంటరెస్ట్?
ఈరోజు రైల్వే కోడూరులో జరిగిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో హోం శాఖను ఎందుకు ఎంచుకోలేదో పవన్ కళ్యాణ్ కారణం చెప్పారు. "అన్నా హజారే స్ఫూర్తితో చిరంజీవి "రుద్రవీణ" సినిమా తీశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ హజారే.. అట్టడుగు స్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారించి సర్పంచ్‌లు పెనుమార్పులు తీసుకురాగలరని యావత్ జాతికి చాటిచెప్పారు. లోక్‌పాల్ బిల్లు, సమాచార హక్కు చట్టం అన్నా హజారే వల్లే సాధ్యమైందని.. దేశంలో సర్పంచ్‌గానే పెద్ద మార్పు తీసుకు రాగలమని ఆయన చూపించారు. మన గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పోర్ట్‌ఫోలియోను ఎంచుకున్నాన"ని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఎంత క్లారిటీతో ఉంటారో, అయినా ఆయా మంత్రుల పదవులను ఎందుకు తీసుకున్నారో తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంత అవగాహన ఉన్న రాజకీయ నాయకుడు ఏపీకి డిప్యూటీ సీఎం గా రావడం తమ అదృష్టం అని పేర్కొంటున్నారు. నెక్స్ట్ సీఎం పవన్ అయితే ఇంకా మంచిగా ఆయన పరిపాలన అందించే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ నుంచి చాలా ఆశిస్తున్నారు ప్రజలు ఈ ఐదేళ్లలో పవన్ మంచిగా పరిపాలన అందించి మంచి పేరు తెచ్చుకుంటే ఆయన సీఎం అవడం పెద్ద కష్టమేమీ కాదు.