లక్‌ అంటే బొత్సదే...ఆయన ఎక్కడ ఉన్నా రాజే ?

Veldandi Saikiran
* కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభం
* వైయస్సార్ హయాంలో  మంత్రిగా బొత్సకు బాధ్యతలు
* వైసీపీలో చేరిన తర్వాత కూడా  మంత్రిగా బాధ్యతలు
* వైసిపి ఓటమి తర్వాత ఎమ్మెల్సీగా గెలుపు
 
* వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు

రెండు తెలుగు రాష్ట్రాలలో... చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే అలాంటి వారి లో...  చాలామంది రక రకాల పదవులు అనుభవిస్తూ ఉంటారు. అయితే కొంత మంది పార్టీలు మారినా కూడా... ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా మంత్రి పదవులు కూడా దక్కించుకుంటారు. ఏ పార్టీలో ఉన్న కచ్చితంగా మంత్రి పదవి మాత్రం దక్కుతూ ఉంటుంది.

అలాంటి వారిలో బొత్స సత్యనారాయణ ఒకరు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీతోనే... తన రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1999లో బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ మొట్టమొదటిసారిగా విజయం సాధించారు.  ఆ సమయంలో ఎన్డీఏ హవా ఉన్నప్పటికీ ఎంపీగా విజయం సాధించారు బొత్స సత్యనారాయణ.

ఇక 2004 మరియు 2009 సంవత్సరాలలో... చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో.. భారీ పరిశ్రమలు మరియు పంచాయతీరాజ్, రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పని చేశారు బొత్స. అంతేకాదు పిసిసి అధ్యక్షులుగా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో  బొత్స సత్యనారాయణ పనిచేశారు.
ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైసీపీలోకి జంపారు బొత్స సత్యనారాయణ. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు బొత్స సత్యనారాయణ. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయినా కూడా... ఇటీవల ఎమ్మెల్సీగా కూడా విజయం సాధించారు బొత్స సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: