జగన్ ను ముంచేసిన గ్రహాలు:విజయసాయిరెడ్డి వల్లే జగన్ విజయానికి దూరమయ్యాడా.?
- అదే అదునుగా భావించి అక్రమాలు
- వైసిపి ఓటమిపై తీవ్ర ప్రభావం.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల మెజారిటీతో అద్భుతమైన విజయాన్ని సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో జగన్ తన మార్కు పాలనతో ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకువచ్చి అందించారు. అలా జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ఆయనకు నమ్మిన బంటుగా ఎంతో మంది నేతలు ఉండేవారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయసాయిరెడ్డి. జగన్ తర్వాత నెంబర్ 2 నేతగా రాష్ట్రంలో ఎదిగారు విజయసాయిరెడ్డి. జగన్ కూడా విజయసాయిరెడ్డికే తన పర్సనల్ విషయాలైనా బిజినెస్ విషయాలైనా రాజకీయ విషయాలైనా చెప్పేవారు. ఇక విజయసాయిరెడ్డి చెప్పారు అంటే జగన్ నోట్లో నుంచి వచ్చిన మాటే అనుకోవాలి. అలా జగన్ కు ఎంతో సన్నిహితుడుగా విజయసాయిరెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో చాలా దగ్గర అయ్యాడు. జగన్ ను అడ్డుపెట్టుకొని ఆయన ఎన్నో అక్రమాలు కూడా చేశారు. ఇదే జగన్ కు కాస్త మైనస్ గా మారుతూ వచ్చింది. విజయసాయిరెడ్డి వల్ల జగన్ కు వచ్చిన నష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విజయసాయిరెడ్డి జగన్ బంధం:
విజయసాయి రెడ్డికి జగన్ కుటుంబంతో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అనుబంధం కొనసాగుతోంది. ఆయన మరణం తర్వాత తన కొడుకు జగన్ తో ఉండి రాజకీయాల్లో ఎదిగేలా చేశారు. దీంతో విజయసాయిరెడ్డిని జగన్ చాలా నమ్మారు. ఈయనకు ముందుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2021లో పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. దీని తర్వాత ఆయనను రెండవసారి 2022 మే 15న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. అలా విజయసాయిరెడ్డి పార్టీకి సంబంధించిన ఎలాంటి వ్యవహారాలైనా చూసుకునేవారు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో ఏది చర్చించాలన్న విజయసాయిరెడ్డి ఉండాల్సిందే. పార్టీకి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని ఢిల్లీ ప్రజలతో మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చారు. అలా జగన్ దగ్గర ఉంటూ భూకంభకోణాలు వంటివి చేసి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు జగను ఎవరు కలవాలన్నా ముందుగా విజయసాయిరెడ్డిని కలవాలి. చాలామంది సాయిరెడ్డి తప్పుల గురించి జగన్ కు చెప్తారని ఒక్కోసారి వారికి అపాయింట్మెంట్ కూడా ఇప్పించేవారు కాదు. దీంతో కిందిస్థాయి నేతలు అందరితో విజయ సాయిరెడ్డికి మధ్య కాస్త దూరము ఏర్పడింది.