ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి : ఆ కారణాలతో జగన్ కి ఎఫెక్ట్ పడిందా..?
ఇక 2019 వ సంవత్సరం ఈ పార్టీ వైపు ఆంధ్ర ప్రదేశ్ జనాలు నిలిచారు. దానితో ఏకంగా వైసిపి పార్టీకి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో తిరుగులేని పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఎదిగింది. అలాగే భారీ అసెంబ్లీ స్థానాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇకపోతే వైసిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా చాలా మంది ఉన్నారు.
వారంతా వైసిపి పార్టీని గానీ జగన్ ను కానీ ఎవరైనా ఏమైనా అన్నారు అంటే వెంటనే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. ఈయన వైసిపి పార్టీని గానీ ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా ఏమైనా అన్నారు అంటే వారిపై తనదైన స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటాడు.
దానితో ఈయనకు వైసిపి పార్టీలో అద్భుతమైన స్థానం దక్కింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1988 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా, 2000 నుండి 2009 పీసీసీ సభ్యుడిగా , 2000 నుంచి 2006 వరకూ కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2005లో హౌసింగ్ బోర్డు డైరెక్టర్గా పని చేశాడు.
ఆయన 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పట్టణ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.