రేవంత్ రెడ్డి : అక్కడి నుండే కెరియర్ టర్నింగ్ పాయింట్..?
సాధారణ జడ్పిటిసిగా కెరీర్ ను మొదలు పెట్టిన ఈయన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ చాలా తక్కువ వయస్సులోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్‌రెడ్డి 2006 లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించాడు. ఆ తర్వాత 2007 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
ఆ తర్వాత రేవంత్ తెలుగుదేశం పార్టీలో చేరి 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత రేవంత్ 2014 లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018 లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. ఆ తరువాత 2018 లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు.
ఆయన 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా నియమితుడయ్యాడు.
ఇది రేవంత్ రెడ్డి కెరియర్ లో టర్నింగ్ పాయింట్. ఇక ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీని ఈయన ఎంతో క్రియాశీలకంగా ముందుకు నడిపాడు. ఎవరికి టికెట్లు ఇవ్వాలి , ఎవరికి ఇవ్వకూడదు. అన్ని విషయాలలో ముందుండి పార్టీని నడిపించాడు. దానితో పార్టీ చాలా తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో బలపడింది.
ఇక 2023 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.