తెలుగు ప్రజలకు గుండె కోత మిగిల్చిన హెలికాప్టర్ ప్రమాదం ?

Veldandi Saikiran
* సెప్టెంబర్ 2 2009లో వైయస్సార్ మరణం
* రచ్చబండ కార్యక్రమానికి వెళ్లి హెలికాప్టర్ కుప్పకూలి మరణం
* వైయస్సార్ మృతి తర్వాత..  ఆయన అభిమానుల మరణం


దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి.. అంటేనే.. సంక్షేమ పథకాలు అందరికీ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. 2004 సంవత్సరం నుంచి రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్  అందించి చరిత్ర సృష్టించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలోనే... రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల... గుండెల్లో దేవుడిగా మిగిలారు రాజశేఖర్ రెడ్డి.


అంతేకాదు  పేద విద్యార్థులు కూడా చదువుకునేలా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలను తీసుకువచ్చి... దేవుడయ్యారు. అయితే అలాంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పగానే హెలికాప్టర్ ప్రమాదం అందరికీ గుర్తుకు వస్తుంది. 2009 సంవత్సరంలో  సెప్టెంబర్ 2వ తేదీన... హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో.. రెండు తెలుగు రాష్ట్రాలు మూగబోయాయి.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. హెలికాప్టర్లో వెళ్లి నల్లమల అడవుల్లో మరణించారు. నల్లమల అడవుల్లోని పావురాల గుట్టలో మరణించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు హెలికాప్టర్ లో ఉన్న... మరో నలుగురు వ్యక్తులు మరణించారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన...  రచ్చబండ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు చిత్తూరు బయలుదేరారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.


అయితే అదే సమయంలో ఏపీ వ్యాప్తంగా... భారీగా వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా... ప్రజల కోసం వెళ్లి వైయస్ రాజశేఖర్ రెడ్డి... హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. ఏపీలో ఉన్న చాలా మంది గుండెపోటుతో మరణించారు. ఇప్పటికీ ఈ హెలికాప్టర్ ప్రమాదం.. మిస్టరీగానే ఉందని కొంతమంది చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr

సంబంధిత వార్తలు: