* పాలిటిక్స్‌లోకి ఎందరో మహిళలు ఎంట్రీ
* వారి లవ్ స్టోరీస్ మరింత హాట్ టాపిక్
* మాజీ బీజేపీ నాయకురాలు పద్మినీరెడ్డి లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
సిలారపు దామోదర్ రాజ నరసింహ సతీమణి పద్మినీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె బీజేపీ పార్టీలో చేరి అప్పట్లో సంచలనం సృష్టించారు. దామోదర్ రాజ నరసింహ ప్రస్తుతం తెలంగాణా ప్రస్తుత ఆరోగ్య, వైద్య క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ డిప్యూటీ సీఎం అయిన దామోదర రాజనర్సింహ పద్మినీరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను సైతం ఎదిరించి వీళ్లు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు చెబుతారు. పద్మినీరెడ్డికి దైవభక్తి చాలా ఎక్కువ. వీరికి త్రిష అనే ఒక కుమార్తె ఉంది.

పద్మినీరెడ్డి చిన్నతనం నుంచి దేవుళ్లను ఎక్కువగా పూజించేవారు. ఆమె పౌరాణిక సినిమాలను అధికంగా వీక్షించేవారు. చిన్నతనం నుంచి దేవుళ్లపై భక్తిని ఎక్కువగా పెంచుకున్నారు. ఆమె తల్లిదండ్రులు పెద్దగా పూజలు చేసే వారు కాదు కానీ ఆమె మేనత్త ఎక్కువగా దేవాలయాలకు వెళ్లేవారు. ఆమె నుంచే ఈమెకు దేవుళ్ళపై భక్తి పెరిగింది. ఈమె చాలా ట్రెడిషనల్. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు ఆమెకు దామోదర రాజనర్సింహ పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా వీరు విడిపోలేదు. ఆ రోజుల్లోనే తల్లిదండ్రులను ఎదిరించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజి చేసుకున్నారు. దామోదర రాజనర్సింహ ఎస్సీ అనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే వీరు పెళ్లి చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్న ఒకానొక సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో కలిశారు. ఆ సమయంలో దామోదర తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీనివల్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. భార్యను బిజెపిలోకి పంపించి దామోదర నాటకాలు ఆడుతున్నారని చాలామంది కామెంట్ చేశారు. అయితే ఇది పెద్ద ఇష్యూ కావడంతో ఆయన సతీమణి పద్మిని మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు.