ఈసారి కూడా నారా లోకేష్‌కే షర్మిల రాఖీ కడుతుందా?

Suma Kallamadi
రాజకీయాలు కుటుంబాలను విడదీస్తాయి. బంధాలను వేరు చేస్తాయి. బాధ్యతలను పక్కన పెట్టేలా చేస్తాయి. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పరిస్థితి చూస్తే అలానే ఉంది. వైఎస్ షర్మిలలో వచ్చిన మార్పును చూసి వైసీపీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ షర్మిల అన్న జగన్‌తో ఆమెకు ఆస్తి వివాదాలున్నాయి. అంతేకాకుండా 2012 నుంచి 2019 వరకూ వైసీపీ కోసం ఆమె ఎంతో కష్టపడింది. అయినా ఆమెకు తగిన ప్రతిఫలం అందలేదని చెప్పాలి. దీంతో ఆమె వైసీపీని కూల్చేందుకే కంకణం కట్టుకుంది. జగన్‌కు రాజకీయ జీవితమే లేకుండా చేసేందుకు ఆమె సాగిస్తున్న రాజకీయాన్ని చైసి వైసీపీ అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో వైఎస్ ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి ఎప్పుడూ రాజకీయ యుద్ధం సాగుతుండేది. ఇప్పుడు షర్మిల కూడా జగన్ కు వ్యతిరేకంగా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు నారా ఫ్యామిలీని షర్మిల ఎన్నో మాటలు అంది. 2019లో అ ఆలు రాని వారు అగ్రతాంబూలం తనకే కావాలన్నడట అనే కొటేషన్ కూడా వాడింది. నారా లోకేష్‌ను నానా రకాలుగా విమర్శించింది. ఆయనపై ఎన్నో సెటైర్లు వేసింది. ఘాటైన విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు అంతా తలకిందులైపోయింది. తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి బాబు ఇంటికి వెళ్లిన షర్మిల చాలా సేపు అక్కడ మాట్లాడారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. దానిని వైసీపీ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అని షర్మిలకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. జగన్ ని మరోసారి జైలులో ఉంచుతారనే విషయం గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా ఇండిపెండెన్స్ డే రోజు ఎట్ హోం పార్టీకి కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల వెల్లారు. అక్కడ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ ఎంతో ఆప్యాయంగా షర్మిలను పలకరించారు. వారిద్దరూ చాలాసేపు అన్నా చెల్లి అని మాట్లాడుకున్నారు. దీంతో అన్నాచెల్లి అంటే వీరేనని మీడియా కూడా బాగా ప్రొజెక్ట్ చేసింది. అయితే మరో మూడు రోజుల్లో రాఖీ పండగ ఉంది. ఈ సమయంలో అన్నగా లోకేష్ కే షర్మిల రాఖీ కడుతుందని అందరూ అనుకుంటున్నారు. అయితే షర్మిల నారా కుటుంబంతో కలిసి ఉండటాన్ని వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: