"మే ఫస్ట్ టైం హిందీ మే బాత్ కరే ఫస్ట్ టైం" బండిని చెండాడిన ట్రోలర్స్.!

Pandrala Sravanthi
- కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా.!
- ట్రోలింగ్ లో మల్లారెడ్డి తర్వాత బండి సంజయే.!


 సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్ ఎక్కువగా జరిగేది సినిమా వాళ్ళ పైనే.  కానీ ఈ మధ్యకాలంలో ఆ ట్రెండు మారిపోయింది. చాలామంది రాజకీయ నాయకులను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ విధంగా ట్రోలింగ్ లో నెంబర్ వన్ స్థానానికి వచ్చారు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇక మల్లారెడ్డి తర్వాత  అంతటి ట్రోలింగ్ ఎదుర్కొన్నది కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అని చెప్పవచ్చు. బండి సంజయ్ మాట తీరులో చాలావరకు తప్పులు దొర్లుతూ ఉంటాయి.  చాలా స్పీడ్ గా  గాబరా గాబరాగా మాట్లాడడంలో బండి సంజయ్ దిట్ట. ఆయన మాటలే చాలా వరకు నవ్వు తెప్పించేలా ఉంటాయి.  ఏదైనా సభలో స్పీచ్ ఇచ్చిన సమయంలో కూడా ఆయన పదాలను స్పీడ్ గా పలకడం వల్ల ఒక్కోసారి అర్థం మారిపోతుంది.  అది కాస్త ట్రోలర్లకు  ఛాన్స్ గా దొరుకుతుంది.  అలా బండి సంజయ్ చాలాసార్లు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు. ముఖ్యంగా బండి సంజయ్ మాట్లాడిన సమయంలో ట్రోలింగ్ కు గురైనటువంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు చూద్దాం.

బండిని చెండాడిన ట్రోలర్స్:
 బండి సంజయ్ ఏబీవీపీ నుంచి విద్యార్థి లీడర్ గా  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా బిజెపిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా  ఆ తర్వాత కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో రెండు పర్యాయాలు డైరెక్టర్ గా పని చేశాడు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా  రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్ నెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. అలా కరీంనగర్ లో బిజెపి పార్టీని బ్రతికిస్తూ వచ్చారు. 2005లో కరీంనగర్ నగరపాలక సంస్థల్లో 48వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా  పోటీ చేసి మూడు పర్యాయాలు గెలుపొందాడు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్లమెంటు స్థానానికి కూడా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు.  ఇక 2019లో బిజెపి నుంచి కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి మొదటిసారి పార్లమెంటులో అడుగు పెట్టాడు.  


ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కూడా బిజెపి నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికై మోడీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాంటి బండి సంజయ్ తన రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ట్రోలింగ్ గురయ్యాడు." ఓసారి ఒక సభలో మాట్లాడుతూ "మే ఫస్ట్ టైం హిందీ మే బాత్ కరో ఫస్ట్ టైం " మచ్చలోంకే హాత్ మే జాన్ గవాడియే హమ్ ఉనికే పనితనంకే, ఇంకా బలిదానంకో బెకర్ నహి దేంగే సమజ్ నయా అంటూ " ఏమి అర్థం కాని భాషలో మాట్లాడి అందరిని నవ్వించాడు. అంతేకాకుండా మరో మీటింగులో " యుద్ధాన్ని ఆపి బరీద్దామా ఈ దేశ ప్రజలకు, అందించినందుకు నర్రేమోడీని, తీర్రుతుర్రా, అర్థం కాలే నాకు" అధికారుల్లోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పర్రుతున్న ముందుకు వస్తున్నాం" ప్రజలకు చేదుఅయ్యే ప్రయత్నం చేస్తున్నాం" నీళ్లు, నిద్య, నిద్దులు" వంటి వాటికోసం తెలంగాణ ప్రజలకు పోరాటం చేయాలని అప్పిల్ చేస్తున్నాం అంటూ మాట్లాడి చాలావరకు ట్రోలర్లకు ఒక ఆప్షన్ గా దొరికాడు. ఈ విధంగా బండి సంజయ్ చాలా సందర్భాల్లో తప్పులు మాట్లాడుతూ దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: