తెలుగు పొలిటికల్ ట్రోలింగ్: "జై శ్రీరామ్" అంటే కడుపు నిండదు..ఉద్యోగం రాదయ్యా ?
* ఇంగ్లీష్, హిందీ స్పీచ్ లలో కేటీఆర్ భేష్
* అసెంబ్లీలో డీకే అరుణ ఎపిసోడ్ తో బుక్ అయిన కేటీఆర్
* జైశ్రీరామ్ నినాదం కడుపు నిండదంటున్న కేటీఆర్ కామెంట్
కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో చాలామంది రాజకీయ నేతలే ఉన్నారు. అచ్చం కెసిఆర్ లాగే.. ఆయన రాజకీయ వారసులు మాట్లాడుతూ ఉంటారు. కెసిఆర్ తర్వాత హరీష్ రావు... ఆయన తర్వాత కల్వకుంట్ల తారక రామారావు కూడా... అదిరిపోయే స్పీచ్ ఇస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కల్వకుంట్ల తారక రామారావు కూడా.. తడబడి.. తప్పులు లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దొరికిపోతూ ఉంటారు.
అయితే మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా... హిందువులను గెలికి కేటీఆర్ ట్రోల్లింగుకు గురయ్యారు. జైశ్రీరామ్ అనే నినాదం జనాలకు కూడు పెట్టడంటూ కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ ను ఒక ఆట ఆడుకున్నాయి హిందూ సంఘాలు. 2014 సమయంలో... గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేటీఆర్.. అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆ సమయంలో గద్వాల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి వచ్చారు డీకే అరుణ.
అయితే ఒక మహిళ ఎమ్మెల్యేను పట్టుకొని కేటీఆర్.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో కెసిఆర్ దగ్గరుండి.. డీకే అరుణకు కేటీఆర్ తో క్షమాపణలు చెప్పించారని ఇప్పటికీ చాలామంది జర్నలిస్టులు చెబుతూ ఉంటారు. ఇక గత ఏడాది మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు.. కడెం ప్రాజెక్టు.. సందర్శించారు. కడెం ప్రాజెక్టు వరద వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.
అయితే అక్కడే ఉన్న జర్నలిస్టులు కడెం ప్రాజెక్టు గురించి ఓ ప్రశ్న అడిగితే.. తనకు పెద్దగా ఐడియా లేదని మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు కేటీఆర్. అంతేకాకుండా... తెలంగాణ ఉద్యమ సమయంలో... పోలీస్ అధికారులను దారుణంగా పచ్చి బూతులతో తిట్టారు కేటీఆర్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అధికారులను తిడితే.. కేటీఆర్ కాంగ్రెస్ నేతలను విమర్శిస్తున్నారు. ఆ సమయంలో పాత కేటీఆర్ వీడియోను వైరల్ చేసి... ఆయనను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.