చంద్రబాబు: ఏపీలో జిల్లాల సంఖ్య తగ్గింపు..?

frame చంద్రబాబు: ఏపీలో జిల్లాల సంఖ్య తగ్గింపు..?

Veldandi Saikiran
ఏపీ జిల్లాలపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ జిల్లాలను కుదించేయాలని అనే అర్థం వచ్చేలా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జిల్లాలు విభజించి చాలా తప్పు చేశారన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే జిల్లాలను మళ్ళీ కలిపే వాడిని అంటూ హాట్‌ కామెంట్స్‌ చేయడం జరిగింది.


చంద్రబాబుకు ఇదే నా వైపు నుంచి విజ్ఞప్తి అంటూ...కిరణ్ కుమార్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల సమస్య పరిష్కారం కావాలంటే ముందు బ్రిజేష్ కుమార్ ని తప్పించాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి. బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పు పై నేను స్టే తెచ్చి 11 ఏళ్ళు అవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతుందని వెల్లడించారు కిరణ్ కుమార్ రెడ్డి.  ఒక సమర్ధుడైన చంద్రబాబు రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావడం సంతోషం అన్నారు.  


ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని.... కేంద్ర సాయంతో వాటన్నింటినీ పరిష్కరించి ముందుకు సాగాలని కోరారు కిరణ్ కుమార్ రెడ్డి.  అత్యంత ముఖ్యమైన రాజధాని, పోలవరం రెండు ప్రాజెక్టులు పూర్తి కావాలని తెలిపారు. ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందన్నారు.  దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అని తెలిపారు కిరణ్ కుమార్ రెడ్డి. మరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.



కిరణ్ కుమార్ రెడ్డి..  సూచనలు చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకుంటే... కచ్చితంగా జిల్లాల పై చంద్రబాబు ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే మళ్లీ ఏపీకి 13 జిల్లాల మిగులుతాయి. మొన్నటి వరకు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం వైపు అడుగులు వేశారు. కానీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెనక్కి తగ్గారు రేవంత్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా ఏపీలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: