కాంగ్రెస్: అప్పుడు వైయస్సార్.. ఇప్పుడు షర్మిల.. అధిష్టానం ఒప్పుకుంటుందా..?
అంతేకాకుండా తాను తీసుకొచ్చిన పథకాలను సైతం ప్రవేశపెట్టి జై కొట్టేలా చేసుకున్నారు. అందుకే అధిష్టానం కూడా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి కి రిఫరెన్స్ ఇస్తూ ఉండేది. అంతేకాకుండా ఏపీలో రాజశేఖర్ రెడ్డిని ఎదిరించే వారు కూడా ఎవరూ లేరు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాటను ఎవరు కూడా జవదాటే వారు కాదు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పైన కూడా చాలానే విమర్శలు వినిపించాయి.. జాతీయ పార్టీని సైతం వైయస్సార్ ప్రాంతీయ పార్టీగా చేసుకున్నారనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఎలాంటి మార్పులు చేయలేకపోయారు.. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ గా వైయస్ షర్మిల ఉన్నారు. ఇమే ఢిల్లీలో పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రస్థాయి కమిటీలు జిల్లా స్థాయి ఇన్చార్జిలు నిర్మించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమెకు నచ్చిన వారిని తనకు మెచ్చిన వారికి మాత్రమే ఈ పదవులు ఇచ్చి మరి కూర్చోబెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 52 మంది పేర్లతో అతిపెద్ద జాబితాను సైతం షర్మిల అందించారట. ఒకవేళ జాబితాకు అధిష్టానం ఓకే చెబితే కచ్చితంగా చాలామంది కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే నాయకులు కనిపిస్తారట. మరి అప్పటి వైయస్ కు ఉన్న ప్రాధాన్యత ఇచ్చి పుంజుకునేలా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల విషయంలో కూడా అదే సాగుతుందా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ఏపీలో షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఉందా లేదా అనేది ఈ జాబితాను బట్టే తేలిపోతుంది.