కారుకు పంక్చ‌ర్‌... కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు... లిస్టులో ఉంది ఎవ‌రంటే..?

frame కారుకు పంక్చ‌ర్‌... కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు... లిస్టులో ఉంది ఎవ‌రంటే..?

RAMAKRISHNA S.S.
బిఆర్ఎస్ ముఖ్య నాయకులు బిజెపితో టచ్లోకి వెళ్లారన్న వార్తలు నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ మరోసారి వదిలిపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అరడజను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే మరోసారి చేరికలు ఉంటాయని అంటున్నారు. వాస్తవానికి కొత్తగూడెం నుంచి గెలిచిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిపి 65 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు అంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. కేసీఆర్ ఎన్నోసార్లు ప్రకటనలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి వెంటనే ఆపరేషన్ ఆకర్షకు తెర‌లేపారు. ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో మొదలుపెట్టి బి.ఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతూ వస్తున్నారు.

బిఆర్ఎస్ కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభ పక్షాన్ని ఏర్పాటు చేయించి సీఎల్పీ లో విలీనం చేయించేందుకు రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారని ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే రేవంత్ రెడ్డి బీర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతారు. ఇక కాంగ్రెస్‌కు ప్రాథినిథ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ చివరి నియోజకవర్గ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ - రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ - పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులను ఆహ్వానించేందుకు రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే బిజెపి పెద్దలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు అని.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడులను ఆహ్వానించేందుకు రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్క‌డ నుంచి రేవంత్ వ‌చ్చిన వెంట‌నే ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ముమ్మ‌రం చేస్తారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: