పీపీపీ విధానంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల నిర్మాణం.. ప్రజలపై ఆ భారం పడుతుందా..?
* మరింత అద్వానంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి
* చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న ఏపీ రోడ్లు
* రోడ్ల దుస్థితిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
* ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై భారం పడనుందా..?
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి గత ఐదేళ్లుగా మరింత అద్వానంగా మారింది..అడుగుకొక గుంత...గజానికొక గొయ్యి..ఇదీ ఏపీ రోడ్ల పరిస్థితి కాస్త వర్షానికే రోడ్లు చెరువులను తలపించే పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర రహదారులు, పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే మరి గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..గత ప్రభుత్వ హయాంలో రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే రాష్ట్రంలో రహదారులు మరీ అద్వానంగా తయారయ్యాయని అధికారంలోకి రాకముందు కూటమి నేతలు గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ ప్రకారం తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..మరీ అద్వానంగా వున్న రోడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అయితే ప్రస్తుతం రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఖజానా లో కాసులు లేవు.. పాడైపోయిన రోడ్ల వల్ల ప్రజల పడుతున్న తీవ్ర ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని కొన్ని ముఖ్యమైన రోడ్లను పీపీపీ విధానంలో నిర్మించాలని చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్లను కూడా పిలవాలని సూచించారు. ఈ విధానంలో ముందుగా ప్రైవేట్ కాంట్రక్టర్లు రోడ్డు నిర్మించి కొంతకాలం టోల్గేట్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయనున్నారు.ఆ తర్వాత ఆ రోడ్డును ప్రభుత్వానికి అప్పగిస్తారు. దీంతో ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా ప్రజలపైనా, వాహనదారులపైనా టోల్ ఫీ రూపంలో భారీగా వసూలు అవుతుంది.. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇంకా వెల్లడించలేదు.
వాహనదారుల నుండి టోల్ ఫీ వసూలు చేస్తుందా లేదా టోల్ ఫీ లేకుండా ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది.. ప్రసుత్తానికి అయితే విధి విధానాల రూపకల్పలోనే ఈ ప్రాజెక్టు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడి బాగా పాడైపోయిన అలాగే ప్రజా వసరాలకు ముఖ్యమైన 27 రోడ్లను ముందుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 1778 కిలోమీటర్ల మేర పీపీపీ విధానంలో ఈ రోడ్లను నిర్మించనున్నారు