వినేశ్ ఫొగాట్ ఎఫెక్ట్.. రెజ్లర్ల బరువు కొలిచే నియమాలలో అలాంటి మార్పులు చేయనున్నారా?

frame వినేశ్ ఫొగాట్ ఎఫెక్ట్.. రెజ్లర్ల బరువు కొలిచే నియమాలలో అలాంటి మార్పులు చేయనున్నారా?

Reddy P Rajasekhar
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా సంచలమైన పేర్లలో వినేష్ ఫొగాట్ ఒకరు. ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ పై అనర్హత వేటు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. వినేష్ ఫైనల్ కు చేరిన తర్వాత కేవలం 100 గ్రాముల అదనపు బరువు ఉందని ఆమెపై అనర్హత వేటు వేయడం జరిగింది. ఈ నిర్ణయం విషయంలో ఇతర దేశాల రెజ్లర్ల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అడుగులు పడుతున్నాయని బోగట్టా.
 
ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయని సమాచారం అందుతోంది. ఇకపై బరువు కొలిచే నియమ నిబంధనల్లో కీలక మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. రెజ్లర్లకు మేలు జరిగేలా ఈ కీలక నిర్ణయాలు ఉండనున్నాయి. రెజ్లర్ల భద్రతతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని స్వల్ప మార్పులు చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ మార్పులు అమల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ దిశగా అడుగులు పడితే రెజ్లర్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతాయి.
 
వినేష్ 50 కేజీల విభాగంలో పోటీపడి అనర్హత వేటుకు గురికావడం విషయంలో న్యాయపోరాటం చేస్తోంది. మరికొన్ని గంటల్లో ఇందుకు సంబంధించి తుది తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు వినేష్ కు అనుకూలంగా రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. వినేష్ కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించగా ఆమె అప్పీల్ ను విచారణకు స్వీకరించడం జరిగింది. వినేశ్ కు న్యాయం జరిగితే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు.
 
వినేశ్ ఫొగాట్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం భవిష్యత్తులో వినేశ్ స్పోర్ట్స్ కు దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. వినేశ్ పతకాలను గెలుచుకోకపోయినా తన ప్రతిభతో హృదయాలను గెలుచుకుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. వినేశ్ ఫొగాట్ ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: