టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. నారి నారి నడుమ మురారి అన్నట్లుగా మారిపోయింది దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి. ఓవైపు భార్య పిల్లలు మరోవైపు ప్రేమించిన మహిళ.. కానీ ఆయన మాత్రం భార్య పిల్లలకు పై వ్యతిరేకంగా ఉంటూ సహజీవనం చేసిన మహిళకే సపోర్ట్ చేస్తున్నారు.. ఎలక్షన్స్ అయిపోయాక అనూహ్యంగా వైసిపి నేతల ఒక్కొక్కరి బాగోతాలు బయటపడుతున్నాయి. ఇందులో భాగంగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో నా ఇంట్లో ఉంటున్నాడని,నా ఇంటి నుండి వెళ్లిపోయి వేరే ఎక్కడైనా అలాంటి పనులు పెట్టుకోమని దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఆరోపించింది.కానీ కూతుర్లు మాత్రం మా నాన్న మాకే కావాలి అని, మా నాన్న మాతోనే ఉండాలి.ఆమె మా ఇంట్లో ఉండకూడదు అని అన్నారు. అలాగే శ్రీనివాస్ తో ఎఫైర్ పెట్టుకున్న మహిళ మంచిది కాదని, ఆమెకు చాలామందితో ఎఫైర్లు ఉన్నాయని, ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారని దువ్వడ వాణి ఆరోపించింది.
అయితే ఈమె మాటలకి దివ్వెల మాధురి ఫైర్ అయ్యి నీ భర్తతో నువ్వు సరిగ్గా ఉండి ఉంటే ఆయనకి ఈ గతి ఎందుకు వచ్చేది.రెండు సంవత్సరాలలో ఒక్కసారైనా ఆయన క్షేమ సమాచారం అడిగావా.. రోడ్డు మీద దిక్కుతోచని వాడిలా వదిలేసావు. ఆయనకు ఫుడ్ పెట్టి షెల్టర్ ఇచ్చి నేనే అన్ని విధాలా చూసుకున్నాను. అలాగే డబ్బు కోసమే నేను ఆయనను బ్లాక్ మెయిల్ చేస్తున్నానని వాణి ఆరోపించిన దాంట్లో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్.. నాకు చాలానే ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటూ మాధురి చెప్పుకొచ్చింది. అయితే వీరి వ్యవహారం ఇలా సాగుతున్న వేళ నిన్న పలాస వెళ్తుండగా లక్ష్మీపూర్ టోల్గేట్ వద్ద దివ్వెల మాధురి కారు ఆగి ఉన్న కారణం ఢీకొని యాక్సిడెంట్ కి గురైంది.కానీ అందులో ఉన్న మాధురికి ఎలాంటి అపాయం జరగలేదని, చిన్నపాటి గాయాలతో బయటపడిందని తెలుస్తోంది.
కానీ హాస్పిటల్ లో చేరిన మాధురి మాత్రం నేను నా పిల్లలపై నాపై వచ్చే ట్రోల్స్ భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను.నాకేం జరిగినా దానికి వాణినే బాధ్యత. ఆమెపై కేసు నమోదు చేయండి అంటూ మీడియాతో మాట్లాడింది.అయితే తాజాగా ఆమె హాస్పిటల్ లో ఉన్న సమయంలో మాధురిని కలవాలని ఉంది అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.అంతే కాకుండా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. నేను మాధురి తో సహజీవనం చేసింది నిజమే. ఆమెతో నేను ఒకే ఇంట్లో ఉండి శారీరక సంబంధం పెట్టుకున్నాను.. వేరే మహిళతో సహజీవనం చేయకూడదని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. నేను ఆమెతో అడల్ట్రీ రిలేషన్ లోనే ఉన్నాను.ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. ఒకప్పుడు నేను పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ట్రోల్ చేసి విమర్శించాను.కానీ నాదాక వస్తే కానీ ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాలేదు అంటూ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు