దువ్వాడ ఫ్యామిలీ బతకు జట్కాబండి షో... ఎక్కడ అంటే..?
ఇక దువ్వాడ కుమార్తె ఆయన ఇంటికి వెళ్లి ఆయన ముందు బైఠాయించి తన తండ్రి బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు మీడియా కూడా ఆమెతో పాటు అక్కడకు వెళ్లింది. అప్పటి నుంచి ప్రారంభ మైన దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ రోజు రోజుక పీక్ స్టేజ్‌కు వెళ్లిపోతోంది. ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ బతుకు జట్కాబండి తరహా లో ఓ షో నడిపిస్తున్నారు. మీడియా వాళ్లు కూడా దువ్వాడ వాణి దగ్గరకు వెళ్లి ఓ మైక్ పెట్టి ఆమెతో కొన్ని మాటలు అనిపించి.. తర్వాత అవే మాటలు మాధురికి చెప్పి ఆమె ముందు మైక్ పెట్టి ఆమెతో కౌంటర్లు ఇప్పిస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య నిప్పు రాజేసే చలి మంటలు కాచుకుని మీడియా వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక మధ్యలో అడల్టరీ గురించి చర్చలు పెట్టి అసలు ఈ శారీరక సంబంధం అనేది రైటా రాంగా అన్న చర్చలు కూడా నడుపుతున్నారు. చివరకు ఆ ఇద్దరు మహిళలకు పుట్టిన బిడ్డలు వారి తండ్రులకే పుట్టారో లేదో అన్న పరస్పర ఆరోపణలు కూడా చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారం టీఆర్పీ లకు మాంచి పండగగా మారింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి మాంచి పాపులారిటీ న్యూస్ గా మారింది. ఏదేమైనా మీడియా ఛానెల్స్ కు టీఆర్పీ రేటింగులు.. దువ్వాడ ఫ్యామిలీని రోడ్డు గతి అయ్యాయి.