జగన్ పదేపదే టీవీ5 ను టార్గెట్ చేయడానికి కారణాలివేనా.. ఆ కథనాలే హర్ట్ చేశాయా?

frame జగన్ పదేపదే టీవీ5 ను టార్గెట్ చేయడానికి కారణాలివేనా.. ఆ కథనాలే హర్ట్ చేశాయా?

Reddy P Rajasekhar
మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఒకింత డీలా పడిన సంగతి తెలిసిందే. జగన్ ఎప్పుడు విమర్శలు చేయాల్సి వచ్చినా రెండు పత్రికల పేర్లను పదేపదే ప్రస్తావించడంతో పాటు టీవీ5 ను టార్గెట్ చేస్తూ ఉంటారు. తమ పార్టీకి ఆ ఛానల్ లో అనుకూల కథనాల కంటే వ్యతిరేక కథనాలు రావడం ఇందుకు కారణమని జగన్ భావిస్తారనే సంగతి తెలిసిందే. వైసీపీకి వ్యతిరేకంగా టీవీ5 లో ఎక్కువ కథనాలు వచ్చాయని సామాన్యులు సైతం అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
 
ఈ రీజన్ వల్లే జగన్ పదేపదే టీవీ5 ను టార్గెట్ చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. కొన్నిరోజుల క్రితం రషీద్ హత్య జరిగిన సమయంలో జగన్ ప్రధానంగా రెండు ప్రధాన పత్రికలతో పాటు టీవీ5 పేరును ప్రస్తావించడం జరిగిందనే సంగతి తెలిసిందే. వైసీపీకి వ్యతిరేకంగా టీవీ5 లో ఎక్కువ సంఖ్యలో కథనాలు రావడం వల్లే జగన్ హర్ట్ అయ్యారని ఆ కథనాలే జగన్ ను హర్ట్ చేశాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉంటాయి.
 
జగన్ కు 2024 ఎన్నికల ముందు సాక్షితో పాటు రెండు ప్రధాన న్యూస్ ఛానెళ్లు సపోర్ట్ అందించాయి. అయితే ఆ ఛానెళ్లు జగన్ కు అనుకూలంగా ప్రచారం చేశాయే తప్ప ఇతర పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేదనే సంగతి తెలిసిందే. అయితే ఇతర ఛానెళ్లు, పత్రికలు మాత్రం జగన్ పాలనలో అభివృద్ధి అణువంతైనా జరగలేదని విమర్శలు చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.
 
జగన్ టీవీ5 ఛానల్ విషయంలో పలు సందర్భాల్లో కఠినంగా వ్యవహరించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆ ఛానల్ కు సంబంధించిన జర్నలిస్ట్ లను సైతం టార్గెట్ చేస్తూ కొన్ని కథనాలు జగన్ సొంత పత్రికలో వైరల్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఛానల్ కు చెందిన ఒక జర్నలిస్ట్ కు 2 కోట్ల రూపాయలు అందాయని జగన్ సొంత పత్రిక వెల్లడించడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: