తె(లు)గులు మీడియా: ఎల్లో మీడియాకి తోడైన హెచ్ఎంటీవీ..?

frame తె(లు)గులు మీడియా: ఎల్లో మీడియాకి తోడైన హెచ్ఎంటీవీ..?

Suma Kallamadi
* తెగులు పట్టిన న్యూస్ మీడియా ఛానెల్స్‌
* సొంత లాభం కోసం జర్నలిస్టు విలువలను మరిచాయి
* హెచ్ఎంటీవీ కూడా
( ఏపీ - ఇండియా హెరాల్డ్)  

ఈ రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా న్యూస్ ఛానెల్స్‌ అనేవి అధికార పార్టీలకు తొత్తులు లాగా పనిచేస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. కొన్ని ఛానెల్స్‌ ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా లేదంటే అధికారంలో ఉన్నా దానికే సపోర్ట్ చేస్తూ షాక్ ఇస్తున్నాయి. ఆ పార్టీ నేతలు తప్పు చేసినా అక్రమాలు చేసినా వాటిని కవర్ చేయకుండా, ఆ నేతలు చేసిన మంచి పనులను హైలైట్ చేస్తున్నాయి. తద్వారా ప్రజలను ఇవి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజుల్లో అవి చాలా పబ్లిక్ గా ఈ పని చేస్తున్నాయి కాబట్టి ప్రజలకు తెలియని కొత్త విషయాలు అంటూ ఏమీ లేవు. ముఖ్యంగా ఏపీలో మీడియా న్యూస్ ఛానెల్స్‌ ఒక పార్టీని ఓడించండి అంటూ బహిరంగంగా ప్రజలకు పిలుపునిచ్చే స్థాయికి దిగజారాయి.
 ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ బాగా మద్దతు ఇస్తేనే ఇవి మనుగడ సాగించేలాగా ఉన్నాయి కాబట్టి అవి జర్నలిజాన్ని పక్కన పెట్టడం సబబు లాగా కొంతమందికి కనిపించవచ్చు కానీ అసలైన ఉద్దేశాన్ని, విలువలను తుంగలోకి తొక్కి ఛానెల్స్‌ నడిపించడం ఎందుకు అనేది అసలైన ప్రశ్న. డబ్బుల కోసమేనా అని అడిగితే బహుశా దానికోసమే అని చెప్పినా చెప్పొచ్చు. టిడిపి పార్టీకి సపోర్ట్ చేసే మీడియాను ఎల్లో మీడియా అని ప్రజలు పిలవడం స్టార్ట్ చేశారు. వాటికి ఇటీవల కాలంలో హెచ్ఎంటీవీ కూడా తోడయ్యింది.
ఇది నిష్పక్షపాత వార్తలు కాకుండా చంద్రబాబుకు అనుకూలంగా వార్తలను రిపోర్ట్ చేస్తుందని, జగన్‌కు వ్యతిరేకంగా న్యూస్ చూపిస్తోందని పొలిటికల్ అనలిస్టుల నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకు చాలా మంది కామెంట్ చేస్తుంటారు. హెచ్ఎంటీవీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 రేంజ్‌లో టీడీపీ మౌత్ పీస్ లాగా పనిచేయదు కానీ అది కూడా ఎల్లో మీడియా అనే చాలామంది లేబుల్ చేస్తున్నారు. ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జోర్దార్ వార్తలు జగన్ ను టార్గెట్ చేసే లాగానే ఉంటాయి. జగన్ ఒక్కసారి కూడా అధికారంలోకి రాకముందు, ప్రతిపక్షంలో ఉండి కష్టపడుతున్నప్పుడు  ఈ హెచ్ఎంటీవీ జగన్ ను ఒక జోకర్ లాగా చూపించే ప్రయత్నం చేసిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికారంలోకి వచ్చాక ఈ ఛానల్ తో ఇప్పుడు కాస్త తగినట్లుగా కనిపించింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ప్రత్యర్థి  జగన్ పై పెట్టినట్లుగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: