దువ్వాడ ఫ్యామిలీలో చిచ్చు వెన‌క స‌జ్జ‌ల‌... మొత్తం తానే చేశాడా..?

frame దువ్వాడ ఫ్యామిలీలో చిచ్చు వెన‌క స‌జ్జ‌ల‌... మొత్తం తానే చేశాడా..?

RAMAKRISHNA S.S.
శ్రీకాకుళం జిల్లా టెక్క‌లికి చెందిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ విష‌యం ఇప్పుడు వైసీపీ ప‌రువు తీసి ప‌డేసింది. దువ్వాడ త‌న భార్య వాణికి విడాకులు ఇవ్వ‌కుండా మాధురితో ఆల్రెడీ క‌లిసి ఉంటున్నారు. దీనిని స‌మ‌ర్థించుకునేందుకు దువ్వాడ తో పాటు మాధురి చెపుతోన్న సాకులు చూసి జనం అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని చెబుతున్న దువ్వాడ త‌న‌లాగా అంద‌రూ రోడ్డున ప‌డ‌డం లేద‌ని.. భార్య పిల్ల‌ల‌ను రోడ్డెక్కించ‌డం లేద‌న్న విష‌యాన్ని గుర్తుంచు కుంటే మంచిది.

దువ్వాడ మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండా.. తాను రోడ్డెక్కేసి ఇంట్లో ఇల్లాలు.. వంటిట్లో అన‌లేం కాని... మ‌రో ఇంట్లో రెండో ప్రియురాలు అన్న టైటిల్ తో త‌న లైఫ్ పై అందరికీ బతుకు జట్కాబండి షో చూపిస్తున్నారు. తన పరువునే కాదు తన భార్య బిడ్డలను కూడా మీడియా చానళ్లకు ఎక్కించిన ఘ‌న‌త దువ్వాడ‌కే చెందుతుంది. దువ్వాడ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అధికారం చెలాయించ‌డం స్టార్ట్ చేశారు. ఆ అధికారం మ‌త్తులో ఉన్న‌ప్పుడే మ‌నోడు ప‌రాయి మ‌హిళ అయిన మాధురి ట్రాప్ లో ప‌డ్డార‌న్న విష‌యం అంద‌రికి తెలుసు.

గత మూడేళ్లుగా దువ్వాడ అక్ర‌మ సంబంధం వ్యవహారం మరీ దారుణంగా మారింది. ఇంటికి వెళ్లకుండా ఆ మహిళతోనే ఉంటున్నార‌న్న విష‌యం టెక్క‌లి ప్ర‌జ‌లు అంద‌రికి తెలుసు. చివ‌ర‌కు ఈ విష‌యంపై పార్టీ హై క‌మాండ్‌కు వాణి ఫిర్యాదు చేయ‌డంతో జ‌గ‌న్ వాణినే టెక్క‌లి ఇన్‌చార్జ్‌గా పెట్టారు. చివ‌ర‌కు సజ్జల రామకృష్ణారెడ్డి వారి పంచాయతీకి పరిష్కారం చూప‌డంతో దువ్వాడ త‌న ఆస్తులు .. వ్యాపారాలు అన్నీ భార్య , పిల్ల‌ల పేర్ల‌పైకి మార్చుతాన‌ని హామీ ఇచ్చి కూడా ఆ ప‌ని చేయ‌లేదు.

పైగా త‌న ఆస్తుల‌ను ఆ మ‌హిళ కోసం క‌రిగించ‌డం మొద‌లు పెట్టారు. అప్పుడు కూడా దువ్వాడ వాణి త‌న‌కే టిక్కెట్ కావాల‌ని డిమాండ్ చేయ‌డంతో పాటు చివ‌ర‌కు దువ్వాడ‌కే సీటు ఇవ్వ‌డంతో ఆమె ఇంటిపెండెంట్‌గా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. స‌జ్జ‌ల ఆమె పేరు మీద ఆస్తులు అన్నీ రాయిస్తాన‌ని చెప్పి ఆమెను పోటీ నుంచి త‌ప్పుకునేలా చేశారు. ఇప్పుడు ఓడిపోయాక దువ్వాడ ఆస్తులేమీ భార్యాపిల్లలకు ఇవ్వకపోగా.. ఆ మహిళతో కలిసి జల్సాలు చేయడం ప్రారంభించారు. స‌జ్జ‌ల చేసిన అనాలోచిత చ‌ర్య‌ల‌తో ఇప్పుడు దువ్వాడ కుటుంబం రోడ్డున ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: