మాచర్ల మండలంలో వెలుగులోకి భూకబ్జా.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పనే?

frame మాచర్ల మండలంలో వెలుగులోకి భూకబ్జా.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పనే?

Suma Kallamadi
ఇటీవల కాలంలో భూములను కబ్జా చేసే రాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతుంది అధికారంలో ఉంటే చాలు ఏదో ఒక తారుమారు చేయడం తర్వాత తమ పేర్ల మీద భూములు రాయించుకోవడం జరుగుతుంది. ఇందుకు వైసీపీ నాయకులు మినహాయింపేమీ కాదు. వాళ్లు కూడా భూములను కబ్జాలు చేసినట్లుగా రికార్డ్స్ తెలుపుతున్నాయి తాజాగా మాచర్ల మండలంలో ఇలాంటి ఒక భూకబ్జా సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాలు తెలుసుకుంటే మాచర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1197-58లో 63.82 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని సబ్ డివిజన్ చేసి, 4.64 ఎకరాలు మాజీ ప్రజాప్రతినిధి అనుచరుడికి డీకే పట్టా (భూమి మంజూరు రకం)గా మంజూరైనట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సర్వే నంబర్ 1284-1లో మరో 1.26 ఎకరాలు కూడా అదే అనుచరుడి కుటుంబానికి డీకే పట్టాగా నమోదైంది. ఈ భూమి అంతా ప్రభుత్వ భూమిగా అధికారికంగా జాబితా చేయబడింది (ప్రభుత్వ పోరంబోకు భూమి).
అయితే వీరికి ఇచ్చిన డీకే గ్రాంట్లు అధికారిక ప్రభుత్వ రికార్డుల్లో కనిపించడం లేదు. అంటే ఉన్నతాధికారులకు తెలియకుండా రికార్డులు మార్చారు, మాచర్ల మాజీ ఎంపీపీ రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొత్తంగా చూస్తే 250 ఎకరాల ప్రభుత్వ భూమిలో 150 మంది మాజీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, లేదా వారి తరపున పనిచేస్తున్న వ్యక్తులు 28 మంది పేర్లతో తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
 ఇలా ఈ భూకబ్జాల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో సామాన్యులతో పాటు ప్రభుత్వ భూములను చాలామంది కబ్జాలు చేశారు. ఇలా భూములను నీటిని స్వాధీనం చేసుకుంటూ వెళ్తే చివరికి పరిస్థితులు ఎలా మారుతాయో అనే భయం నెలకొన్నది. ఈ అక్రమాలకు చెక్ పెట్టేవారు రావాలి. ఎవరు భూముల్లో కబ్జా చేయకుండా ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులకు ఉంది కానీ అందరూ కూడా నిమ్మకు నీరు ఎత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. అందువల్ల దేశంలో అన్ని నేరాలు పెరిగిపోతున్నాయి. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: