ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం గురించి రచ్చ జరుగుతుంది. దీని చుట్టూ పొలిటికల్ వ్యవహారం కూడా చుట్టుకుంది. రెండు ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయని చెప్పవచ్చు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ కు అచ్చెన్నాయుడు చెక్ పెట్టారని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. దువ్వాడ శ్రీనివాస్ సీనియర్ పొలిటీషియన్. అలాంటి ఈయన చట్టాన్ని గౌరవించకుండా భార్య పిల్లలు ఉండగా మరో అమ్మాయితో ఉండడం చట్టపరంగా నేరమే అవుతుంది. కానీ శ్రీనివాస్ తో ఉన్న అమ్మాయి చేసింది తప్పుకాదు.ఎందుకంటే ఆమె మేజర్ కాబట్టి. ఎందుకంటే ఆమె దువ్వాడని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నేరం కాదు. పెళ్లి చేసుకోకుండా మైనారిటీ తీరిన వాళ్ళు ఇష్టపడి కలిసి ఎక్కడైనా సహజీవనం చేయవచ్చు. అది చట్టబద్ధంగానే ఉంది.
కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు తన భార్యకు విడాకులు ఇవ్వకుండా ఈ అమ్మాయితో అలా ఉండడం తప్పకుండా నేరమే అవుతుందని కొంతమంది సీనియర్ న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే ఇదే విషయంపై స్పందించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ నా భార్య వేధింపులకు గురిచేస్తుంది. నన్ను కొడుతోంది. ఆమె పార్టీ పదవుల కోసం పోరాడుతూ నాపై దారుణంగా వ్యవహరిస్తోందంటూ మీడియా ముందు వాపోయారు. నా ఆస్తులు అన్ని లాక్కోవడానికి ఫైట్ చేస్తోంది. ఆమెకు నేను విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా పిల్లల బాధ్యత నేనే చూసుకుంటానంటూ దువ్వాడ శ్రీనివాసరావు మీడియా ముందు ఆరోపించారు. దీని వెనకాల టిడిపి హస్తం ఉందని, ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఇదంతా చేయిస్తున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు.
అయితే దీనిపై స్పందించినటువంటి మాధురి చాలా క్లియర్ గా ఆరోపణలు చేసింది. నాకు శ్రీనివాస్ కు ఎలాంటి సంబంధం లేదని, మా ఇద్దరి మధ్య కేవలం హేల్దీ ఫ్రెండ్స్ రిలేషన్ షిప్ మాత్రమే ఉందని, తన భార్య వాణి ఈ సంబంధాన్ని అంటగడుతుందని,నా పరువు తీస్తోందని నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలని కంటతడి పెడుతోంది. నాకు డబ్బు విషయంలో ఆశ లేదని,నేను ఎంతో సంపాదించానని,ఎన్నికల సమయంలో దువ్వాడ కోసం నేనే డబ్బు ఖర్చు పెట్టానని అన్నది. అలాంటి నేను ఆయన దగ్గర ఆస్తులు ఏమి తీసుకుంటానని తెలియజేసింది. ఈ విధంగా ఈ వ్యవహారం నడుస్తున్న తరుణంలో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇదంతా టిడిపి అచ్చెన్నాయుడే చేయిస్తున్నారని ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.