ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. నాలుగు ఎంపీలు మాత్రమే వైసిపి పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోవడం వెనుక అనేకకారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, ఐ ప్యాక్ నిర్ణయాలు అమలు చేయడం... లాంటివి వైసిపి కొంపముంచాయి.
అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను అసలు పట్టించుకోలేదట. వాలంటీర్ వ్యవస్థ కారణంగా ఎమ్మెల్యేలకు అలాగే ప్రజలకు మధ్య... బంధం తెగిపోయిందని స్వయంగా వైసీపీ నేతలు చెప్పారు. ఇదే విషయాన్ని మొన్నటి వరకు... ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి... కూడా సోషల్ మీడియాలో తెలపడం జరిగింది. కేతిరెడ్డి తో పాటు.. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని స్పష్టం చేసి పార్టీని వీడుతున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ఒక అడుగు ముందుకు వేసి.. జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల వైసీపీ పార్టీ ఓడిపోయిందని చెబుతున్నారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన వేయాలని జగన్మోహన్ రెడ్డి అంటుంటే... దానికి విరుద్ధంగా కేతిరెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే ఓటమి తర్వాత... వైసిపి వైఫల్యాలను ఎత్తి చూపిన కేతిరెడ్డి... నియోజకవర్గం వైపు అస్సలు వెళ్లడం లేదట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇంటింటా తిరిగేవాడు కేతిరెడ్డి. కానీ ఇప్పుడు అసలు నియోజకవర్గంలో అడిగే పెట్టలేదట.
బెంగళూరులో ఉంటూ సోషల్ మీడియాలో వీడియోలు మాత్రమే పెడుతూ రచ్చ చేస్తున్నాడట కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి. క్యాడర్ కు అండగా ఉండాల్సింది పోయి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కేతిరెడ్డి వ్యవహరించడంతో అందరూ అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వైసిపి పార్టీని వీడేందుకు కేతిరెడ్డి రూట్ క్లియర్ చేసుకున్నట్లు చెబుతున్నారు. జనసేన పార్టీలోకి వెళ్లేందుకు కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటున్నారు.