భర్తతో అనిత నరకం అనుభవించారా...విడాకులు తీసుకోకుండానే ?

frame భర్తతో అనిత నరకం అనుభవించారా...విడాకులు తీసుకోకుండానే ?

Veldandi Saikiran
* కొసర శివ ప్రసాద్ తో అనిత వివాహం
* విడాకులు తీసుకోకుండానే విడిపోయిన జంట
* ఇద్దరు పిల్లలు అయిన తర్వాత గొడవలు
* పోలీస్‌ స్టేషన్‌ లో పోలీసు కేసులు

తెలుగుదేశం పార్టీలో చాలామంది ఫైర్ బ్రాండ్ నేతలు ఉన్నారు. అలాంటి వారిలో ఏపీ హోమ్ మంత్రి, టిడిపి సీనియర్ లీడర్ వంగరపూడి అనిత. ఆమె మైక్ పట్టిందంటే.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. అంతలా వంగలపూడి అనిత ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ... రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నారు వంగలపూడి అనిత.
2012 సమయంలో.. అంటే ఆమె వయసు 34 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. అంతకుముందు విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం లోనే సదాసీదా టీచర్ గా పని చేశారు అనిత. అయితే... రాజకీయాలలోకి రావాలని ఆసక్తితో తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ తరుణంలోనే 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లో దూసుకు వెళ్లారు. ఇక 2019లో ఓడిపోయిన అనిత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హోం మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే... వంగలపూడి అనిత పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు అనిత. తన అన్నయ్య ఫ్రెండ్ అయిన కొసర శివ ప్రసాద్ ను... ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వంగలపూడి అనిత. అయితే ఈ వివాహం ఇంట్లో ఇష్టం లేకపోయినా అనిత చేసుకోవడం జరిగింది.
పోలీస్ స్టేషన్ సమక్షంలోనే అనిత వివాహం అయినట్లు సమాచారం.  అయితే అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు అయ్యాక ఇద్దరు దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకోకుండానే... వేరువేరుగా జీవిస్తున్నారు అనిత దంపతులు. అయితే అప్పట్లో... ఈ వివాదం పైన.. రోజా అసెంబ్లీలో మాట్లాడారు. అనితలాగా భర్తను కొట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లలేదని... రోజా అనడం జరిగింది. ఆ సమయంలో రోజాపై సస్పెన్షన్ వేటు కూడా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: