ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖల్లో ప్రక్షాళన మొదలుపెట్టింది. అంతేకాదు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసిన సంగతి తెలిసిందే.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్లు మార్పు చేసింది. ఈ క్రమంలో నేడు(శనివారం) ఏపీలోని పలు ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.దీంతో అనేక నీటిపారుదల పథకాలు, ప్రాజెక్టుల పేరు మారనున్నాయి. ముఖ్యంగా గత వైఎస్సార్ పార్టీ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసీపీ నేతల పేర్లను సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది.అయితే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది. వైఎస్‌ఆర్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా, వైఎస్‌ఆర్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. అనంత వెంకట రెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను హంద్రీ నీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పునరుద్ధరించనున్నారు. అలాగే వరికపూడిశెల, సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్ పేర్లనూ పునరుద్ధరించింది.ఈ నేపథ్యం లోనే కొన్ని పధకాల పేర్లను కూడా కూటమి ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితా లో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి స్కీమ్ పేరును తల్లికి వందనంగా నామకరణం చేసింది. ఈ పేరు మార్చడంపై ఇటీవల నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా కానుక పథకంను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. అదే విధంగా జగనన్న గోరు ముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంగా ఏపీ ప్రభుత్వం నామకరణం చేసింది. మన బడి నాడు -నేడు పథకాన్ని ‘మన బడి - మన భవిష్యత్తు’ అని, స్వేచ్ఛ అనే పథకాన్ని బాలికా రక్ష గా మార్చారు. ఇక మాజీ సీఎం జగన్ పేరిట ఉన్న మరో పథకం జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా నామకరణం చేసింది కూటమి ప్రభుత్వం.