జగన్ కు బైరెడ్డి వెన్నుపోటు...వైసీపీని వదిలేశాడా ?
కానీ ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా మిగలకుండా అంతా టీడీపీలో చేరిపోయారు. రూరల్ మండలంలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. మండల, గ్రామస్థాయి నేతలు పోటీలు పడి టీడీపీలో చేరిపోతున్నారు. నందికొట్కూరు టీడీపీలో రెండు వర్గాలు ఉండడంతో ఎవరి సమక్షంలో చేరాలో అర్థం కాక కేవలం నేతలను కలిసి వస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరలేదు. వైసీపీ నేతలను ఆయన టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు తప్ప కండువాలు కప్పుకోవడం లేదు.
మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కండువాలు కప్పుతూ అధికారికంగా పార్టీలో చేర్చుకుంటున్నారు. పార్టీలో ఎప్పటినుంచో ఆధిపత్య పోరు కనిపిస్తుంటే వైసీపీ నుంచి నేతలు వచ్చి పడటంతో టీడీపీలో పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. క్యాడర్ అంతా టీడీపీలోకి వెళుతున్న వైసీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. టీడీపీలో చేరికలపై యువనేత ఇప్పటివరకు స్పందించడం లేదు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యూహంపై పార్టీ శ్రేణుల్లో గుసగుసలే వినిపిస్తున్నాయి.
నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ మాండ్ర శివానందరెడ్డి వెంట నడుస్తోంది. కండువా మార్చిన వైసీపీ నేతలు మాత్రం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శిబిరంలో ఉంటున్నారు. అయితే.. నందికొట్కూరులో నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా...బైరెడ్డి కావాలనే సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. జగన్ పై బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అలిగారని.. కొంత మంది అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన డిమాండ్స్ జగన్ నెరవేర్చకపోవడంతో.. బైరెడ్డి ఇలా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.