కూటమి ప్రభుత్వంలో మూడు కొత్త పథకాలు.. ముహూర్తం ఫిక్స్ ...!
- మహిళలకు ప్రీ బస్సు జర్నీ తో పాటు అన్న క్యాంటీన్లు స్టార్ట్
( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరిట ఆరు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరు హామీలకు ప్రజలలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంలో ఈ సూపర్ సిక్స్ పథకాలు బాగా హైలైట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ నెల 15వ తేదీ నుంచి 3 పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా పెన్షన్ నాలుగు వేలకు పెంచుతానని చెప్పారు. అది ఇప్పటికే అమలు చేసి చూపించారు. పైగా జూలై నెల ఒకటో తేదీన అంతకుముందు మూడు నెలల నుంచే పెంచిన పెన్షన్ కలుపుకొని ఒక్కొక్కరికి ఏడు వేల పెన్షన్ అందజేశారు. వికలాంగుల పెన్షన్ కూడా రు. 6000 చేశారు. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఆగస్టు 15 నుంచి మూడు పథకాలు అమలు చేయాలని తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు తల్లికి వందనం పథకం - అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్న క్యాంటీన్ ను ఏర్పాటుపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఎప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.. ఇక మిగిలిన పథకాల హామీపై స్పష్టత రావాల్సి ఉంది.