బెజ‌వాడ వైసీపీలో పేద్ద కుదుపు... జ‌గ‌న్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా..?

frame బెజ‌వాడ వైసీపీలో పేద్ద కుదుపు... జ‌గ‌న్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా..?

RAMAKRISHNA S.S.
సాధారణ ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అసలు ఇప్పట్లో వైసీపీ కోలుకుంటుందా ? అన్న సందేహాలు కూడా ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలకమైన విజయవాడ నగరంలో వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ఇప్పుడు కూటమి లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికలకు ముందు కొందరు ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతు పలికారు. వైసీపీ కార్పొరేటర్ ఎం. విజయకుమార్ ఏకంగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినాయకుడు తో పాటు నియోజకవర్గ నేతల తీరుపై విసుగు చెందిన పలువురు వైసిపి కార్పొరేటర్లు తమ అనుచరులతో కలిసి కూట‌మి లో చేరేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి - ఎంపీ కేసినేని చిన్ని తో మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్లు మరిపెళ్ళ రాజేష్ మహదేవ్ అప్పాజీ - అర్షద్ - గుడివాడ నరేంద్ర - రత్నకుమారి - మాధురి లావణ్య - ఆదిలక్ష్మి తదితర కార్పొరేటర్లు అంతా కానూరులోని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంటికి వెళ్లి మాట్లాడారు.

ఎన్నికలకు ముందు తర్వాత కూడా తమను వైసీపీ అధిష్టానం అస్సలు పట్టించుకోలేదని .. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తో పాటు పశ్చిమ నియోజకవర్గం లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షేక్ ఆసిఫ్ రాజకీయ అవసరాల కోసం తమను వాడుకుని వదిలేసారని వారు వాపోయినట్టు తెలిసింది. వీరి తో పాటు పశ్చిమ నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న పలువురు కీలక నేతలను కూడా కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీకి చెందిన పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు అందరూ ఎమ్మెల్యే సుజనా చౌదరి వద్దకు నేరుగా రావడం ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గతంలో పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మాధురి లావణ్యను వైసీపీలో బలవంతంగా చేర్చుకున్నారు ... అక్కడ ఇమ‌డలేక ఆమె తిరిగి కూట‌మి లో చేరేందుకు రెడీ అవుతున్నారు .. ఇక సెంట్రల్ - తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు సైతం కూట‌మి లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: