వైసిపి ఖాళీ ఖాళీ : అలాంటోళ్లే భయపడితే.. ఇంకా పార్టీలో ఎవరుంటారు?
ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు అందరూ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు అని చెప్పాలి. దీంతో వైసిపికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇక ఫ్యాన్ పార్టీ నుంచి గెలిచిన నేతలు కూడా సైకిల్ ఎక్కే అవకాశం ఉందని త్వరలోనే ఇక వైసిపి ఖాళీ కాబోతుంది అంటూ వార్తలు కూడా తెరమీదకి వస్తూ ఉన్నాయి. ఇక వార్తలు రావడం కాదు ఇక ఇప్పుడు ఇది నిజంగానే జరుగుతుంది. ఒక్కొక్కరుగా వైసిపి పార్టీకి రాజీనామా చేస్తూ ఇక కూటమిలోని ఏదో ఒక పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు.
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఖాళీ అయ్యే పరిస్థితి రావడానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. మొన్నటి వరకు జగన్ను పల్లెత్తు మాట అన్న కూడా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడిన అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలు.. ఇక ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అటు వైసిపి నేతలపై దాడులు జరుగుతున్నా.. ఫ్యాన్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేస్తున్నా.. సొంత పార్టీ నేతల హత్యలు జరుగుతున్న కూడా ఎక్కడా తెర మీదకి వచ్చి నోరు విప్పడం లేదు. దీంతో ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలే ఇప్పుడు పరిస్థితులు చూసి భయపడి నోరు విప్పకపోతే.. ఇక పార్టీని కాపాడేదెవరు.. మా పరిస్థితి ఏంటో అని భయపడి మిగతా నేతలు అందరూ కూడా పార్టీని వీడుతున్నారు అనేది తెలుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో వైసిపి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూటమి పార్టీలలో చేరే అవకాశం ఉందని.. ఇలా జరిగితే వైసిపి పూర్తిగా ఖాళీ అయ్యి.. మరో పార్టీలో విలీనం చేసే పరిస్థితికి పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచన వేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి.