ఆ దిశగా అడుగులు వేయొచ్చుగా.. కోర్టులను ఆశ్రయించడం వల్ల లాభం ఉందా?

frame ఆ దిశగా అడుగులు వేయొచ్చుగా.. కోర్టులను ఆశ్రయించడం వల్ల లాభం ఉందా?

Reddy P Rajasekhar
మాజీ సీఎం జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ఆ ఇబ్బందులను ఆయన ఏ విధంగా అధిగమించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2024 ఎన్నికల ఫలితాల వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జగన్ ధైర్యంగానే ఉన్నారు. చిన్నచిన్న సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తూ జగన్ ముందడుగులు వేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
 
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ లో ఒకింత నైరాశ్యం కనిపిస్తోంది. ఒకప్పటి జగన్ కు ఇప్పటి జగన్ కు చాలా తేడా ఉందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. జగన్ చేసిన కొన్ని తప్పులే ప్రస్తుత వైసీపీ పరిస్థితికి కారణమని సొంత పార్టీ నేతల నుంచి కామెంట్లు వినీస్తున్నాయి. జగన్ పదేపదే తన భద్రత గురించి, ప్రతిపక్ష హోదా గురించి కోర్టులను ఆశ్రయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ ప్రజల మద్దతును పొందే దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ ఆ దిశగా అడుగులు వేస్తే మాత్రం వైసీపీకి పూర్వ వైభవం రావడంతో పాటు జగన్ పై ప్రజల్లో నమ్మకం కలిగే అవకాశం ఉంది. తనపై ట్రోల్స్ కు అవకాశం లేకుండా జగన్ వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
 
వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని జగన్ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వైసీపీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేయకుండా టీడీపీ, పవన్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తే రాబోయే రోజుల్లో సైతం వైసీపీకి మరిన్ని షాకులు తప్పవని చెప్పవచ్చు. జగన్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే పార్టీకి అంత నష్టం కలిగే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో అయినా జగన్ లో మార్పు వస్తే బాగుంటుందని వైసీపీ నేతలు కోరుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: