హైద‌రాబాద్‌లో ఇళ్లు కొనాలంటే క‌ష్ట‌మే.. రేటు చూస్తే చుక్క‌లే సామి..!

frame హైద‌రాబాద్‌లో ఇళ్లు కొనాలంటే క‌ష్ట‌మే.. రేటు చూస్తే చుక్క‌లే సామి..!

RAMAKRISHNA S.S.

( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .
తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా మారి పోయింది. శివార్ల‌కు వెళ్లినా కూడా ఇళ్లు కొన‌లేని ప‌రిస్థితి వ‌చ్చేసింది. క‌నీస సౌక‌ర్యాల‌తో కూడిన ఓ ఇళ్లు కొనాలి అంటే క‌నీసం కోటి రూపాయ‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ లోపల చిన్న చిన్న బిల్డర్లు కట్టే అపార్టుమెంట్లు.. వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల లోప‌ల ఉండేవి కూడా త‌క్కువ‌లో త‌క్కువుగా రు. 70 లక్షలకు తక్కువ ఉండటం లేదు. ఇక కాస్త బ్రాండెడ్ బిల్డర్లు, రెరా నిబంధనలతో కట్టే ఇళ్లు కొనాలంటే అక్ష‌రాలా కోటి రూపాయ‌లు ముట్ట చెప్పాల్సిందే.

అయితే రూ. కోటి దాటిపోయాయి.. ఆ రేంజ్‌ ఇళ్లకు డిమాండ్ ఏమైనా త‌క్కువుగా ఉందా ? అంటే ఏం లేదు.. కోటి రూపాయ‌ల కు కొనే ఇళ్ల కు డిమాండ్ ఏ మాత్రం తక్కువ ఉండటం లేదు. కోటి రూపాయలు మించి ధర ఉన్నఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం వరకు పెరిగాయట‌. మ‌రో విచిత్రం ఏంటంటే రు. 50 లక్షల నుంచి కోటి లోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు బాగా తగ్గాయి. కోటి నుంచి కోటిన్నర రూపాయల రేంజ్‌లో ఇళ్ల అమ్మకాలు గత యేడాది ఇదే టైంతో స‌రి పోల్చినప్పుడు 67 శాతం పెరిగ్గాయని రికార్డులు చెబుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే బిల్డ‌ర్లు సైతం ఇప్పుడు కోటి రూపాయ‌లు.. కోటి రూపాయ‌ల పైన ఇళ్లు క‌ట్టి అమ్మేందుకే ఎక్కువుగా ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు 50 నుంచి 70 లక్షల బడ్జెట్‌లో ఇల్లు కొనాల‌ని విశ్వ‌ ప్రయత్నాలు చేస్తున్నా.. దొరకడం లేదు. నగర శివారు అయిన నారపల్లి, కొర్రెములలాంటి ప్రాంతాలు.. ఉప్పల్ నుంచి తొమ్మిది కిలో మీటర్ల పై బ‌డి దూరంలో ఉంటాయి. ఇక్క‌డ కూడా రేట్లు రు. 90 ల‌క్ష‌లు చెపుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇల్లు కొనాలి అంటే మధ్యతరగతివారికి ఒక్క జీవితం సరిపోదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: