మాజీ భర్తకు రూ.15 లక్షలు చెల్లించాల్సిందే.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు?
దీంతో నేటి రోజుల్లో ఏకంగా విడాకులు కావాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్న భార్యాభర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఇక ఇలాంటి ఘటనలు వైవాహిక బంధం పై ఉన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరిలో కూడా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా విడాకులు తీసుకుంటున్న సమయంలో భర్త నుంచి వేరుపడుతున్న భార్యకు కొంత మొత్తంలో భరణాన్ని చెల్లించే విధంగా కోర్టులు ఈ మధ్యకాలంలో తీర్పుని ఇవ్వడం చూస్తూ ఉన్నాం అని చెప్పాలి. కానీ ఇక్కడ కోర్టు మాత్రం ఏకంగా భర్తకు మాజీ భార్య 15 లక్షలు చెల్లించాలి అంటూ తీర్పుని ఇచ్చింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
మాజీ భర్త అతని కుటుంబ సభ్యుల పరువుకు నష్టం కలిగించినందుకు ఏకంగా 15 లక్షల రూపాయలు చెల్లించాలి అంటూ ఓ మహిళకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా పలు వేదికలపై మాజీ భర్త అత్తమామలపై తప్పుడు ప్రచారం చేసినందుకుగాను ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. 9% వడ్డీతో కలుపుకొని ఇక డబ్బు చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది అని చెప్పాలి. ఒకసారి విడాకులు తీసుకుని వేరుపడిన తర్వాత మాజీ భర్త అతని కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ తేల్చి చెప్పింది కోర్టు.