పవన్ కు కొత్త తలనొప్పి.. జనసేన లాడ్జ్ రాజకీయాలు.. ?

frame పవన్ కు కొత్త తలనొప్పి.. జనసేన లాడ్జ్ రాజకీయాలు.. ?

Veldandi Saikiran
అంబేద్కర్ కోనసీన జిల్లా రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ స్థానికులకు అందుబాటులో ఉండడం లేదట. వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అన్నట్టుగా అప్పుడప్పుడు హైదరాబాద్ టు రాజోలు వచ్చి వెళ్తున్నారట. తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాజోలులో అద్దె ఇల్లు కూడా తీసుకోకుండా నడిపిస్తున్నారట. తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు ముందే పిఠాపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటమే కాకుండా సొంత స్థలం కూడా కొన్నారట.

కానీ అదే జనసేనకు చెందిన రాజోలు ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యే గిరి అంటే ఏదో ఆశామాషి వ్యవహారంలాగా అనుకుంటున్నారని.... రాజోలు ను పిక్నిక్ స్పాట్ గా చూస్తున్నారు తప్ప ప్రజాసేవ గురించి ఆలోచించడం లేదని నెగిటివ్ టాక్ మొదలైందట. ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కనీసం ఓ ఇంటిని అద్దెకు తీసుకోకపోగా చుట్టపు చూపుగా వచ్చినప్పుడల్లా స్థానికంగా ఉన్న ఒక లాడ్జిలో మఖాం వేస్తున్నారట. అన్ని వ్యవహారాలను అక్కడి నుంచే చట్టబడుతున్నారట. చివరికి జనసేన సమావేశాలను సైతం లాడ్జిలోనే పెడుతున్నారు. దీంతో అక్కడికి వెళ్లి సమస్యలను చెప్పుకోవడానికి మహిళలు సిగ్గుపడుతున్నారట.

కారణం ఏదైనా మనం ఏంటి లాడ్జికి వెళ్లడం ఏంటని సొంత పార్టీకి చెందిన వీర మహిళలు సైతం సిగ్గుతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమం పేరుతో లాడ్జికి రాలేమంటూ అసలు కార్యక్రమాలకి వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది. దానికి బదులు ఓ అద్దె ఇల్లును తీసుకొని ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అనే వాక్యాలు జనసేన వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ప్రజా ప్రతినిధి అయినాక కూడా అతనికి అధికార పోకడకు పోకుండా లాడ్జిలో కూర్చొని ఆదేశాలు ఇస్తుంటారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.

రాజోలు ప్రజలకు రెండు నెలలకే ఈ లాడ్జి రాజకీయాలు విసుగు పుట్టిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. జనసేన, జనవాణి రాష్ట్ర కోఆర్డినేటర్ గా పనిచేసిన వరప్రసాద్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇలా ప్రవర్తిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోందట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మిగిలిన జనసేన ఎమ్మెల్యేలు అంతా ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారట. వారితో పోల్చుకుంటే రాజోలు ఎమ్మెల్యే వెనుక పడ్డారన్నది లోకల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: