ఏపీలో రాష్ట్రపతి పాలన.. జగన్ మాటల వెనుక ఆంతర్యం ఏంటి.?

frame ఏపీలో రాష్ట్రపతి పాలన.. జగన్ మాటల వెనుక ఆంతర్యం ఏంటి.?

Pandrala Sravanthi
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం  ఏర్పడి నెలరోజులు ఇప్పటికే గడిచి పోయింది. ఇదే తరుణంలో రాష్ట్రంలో చాలా అలజడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. వినుకొండలో వైసీపీ నేతపై టిడిపి కు సంబంధించిన నేత దాడి చేసి నడి రోడ్డుపై నరికి చంపడం సంచలనం సృష్టించింది.  దీనిపై స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు. అలాంటి ఈ తరుణంలో రోజురోజుకు వైసిపి నాయకుల పై టిడిపి నాయకుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కర్రలతో దాడులు చేయడం,ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం వంటివి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే వణికి పోతున్నారట. 

దీనిపై స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో ఏం పాలన నడుస్తోంది. తాలిబన్ లాగా టిడిపి నాయకులు పాలన చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.  అయితే సుబ్బారాయుడు హత్య ఒకవైపు మరోవైపు నవాబుపేట ప్రాంతంలో పథకం ప్రకారం హత్యా ప్రయత్నం చేసాడు అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి వచ్చి స్పందించారు. దాని ప్రకారమే వైసిపి నేతలపై 20 మంది టీడీపీ నాయకులు కలిసి కొంతమందిని కొట్టడంతో వారంతా హాస్పిటల్ లో చేరారు. బెంగళూరు నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సన్ రైజర్స్ ఆసుపత్రిలో  ఉన్న వారిని పరామర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

 రాష్ట్రంలో దారుణమైన పాలన నడుస్తోందని ఆయన అన్నారు. రైతులకు 25వేల సహాయం చేస్తానని చెప్పి ఎగరగొట్టేసారని, అంతేకాకుండా తల్లులను మోసం చేసి అమ్మ ఒడిని కూడా ఎగర కొట్టేసాడని అన్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తాత్సరం వహిస్తూన్నారని తెలిపారు. పథకాలు అమలు పక్కనపెట్టి దారుణంగా వైసిపి నాయకులపై ఇతర ప్రజలపై దాడులు చేస్తున్నారని, దీనిపై ప్రధాన ప్రతిపక్ష నాయకులందరికీ తెలియజేస్తానని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రందనలకు విరుద్ధంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.   ప్రస్తుతం జగన్ ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: