ఆంధ్రప్రదేశ్‌లోని ఈ మూడు విమానాశ్రయాలు ప్రైవేట్ చేస్తున్నారా..?

frame ఆంధ్రప్రదేశ్‌లోని ఈ మూడు విమానాశ్రయాలు ప్రైవేట్ చేస్తున్నారా..?

Suma Kallamadi


సాధారణంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసేవారు టికెట్ ధర అంత ఎందుకు ఉంది అనేది ఆలోచించకుండా కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా ఫ్లైట్ టికెట్ ధర ఎందుకు అంత ఉంది అని చెక్ చేస్తే అందులో ఎయిర్‌పోర్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగుల ఖర్చులు, జీఎస్టీ వంటి ఎన్నో యూజర్ ఛార్జీలు ఉంటాయి. ప్రభుత్వ విమానాశ్రయాలలో ఈ యూజర్ చార్జీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ప్రైవేట్ వాళ్ళు మాత్రం చాలా అధికంగా వసూలు చేస్తారు. అయితే ప్రభుత్వం తీసుకోబోతున్న ఒక నిర్ణయం ఈ యూజర్ ఛార్జ్ ల పెరుగుదలకు కారణమయ్యే అవకాశం ఉంది. దాంతో ఏపీ ప్రజలకు షాక్ తగలనుంది. 

ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు ఎయిర్‌పోర్ట్స్ ను ప్రైవేట్ చేయనుంది. దీనివల్ల ఆ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులు ఎక్కువ యూజర్ ఛార్జ్‌లు చెల్లించాల్సి వస్తుంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలు కూడా ఈ 25 విమానాశ్రయాల లిస్టులో ఉన్నాయి. అంటే వాటిని ప్రైవేట్ చేయనున్నారు.

 2022 నుంచి 2025 సంవత్సరాల మధ్యలో ఇవ్వాలని అనుకున్నా విమానాశ్రయాల్లో ఈ మూడు విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. అత్యుత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేట్ రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకోవడానికి ఎయిర్‌పోర్ట్స్‌ను లీజ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖకు మంత్రి. మరి ఈ మూడిటిని లీజుకి ఇవ్వడానికి ఆయన అనుమతి ఇస్తారో లేదో చూడాలి ఒకవేళ లీజ్ కు ఇస్తే టెండర్లు నామినేషన్ల పద్ధతిలో లీజుకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద వీటిని ప్రైవేట్ కు ఇవ్వాలా ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలా అనేది చంద్రబాబు సర్కార్ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వీటిని ప్రభుత్వంలోనే ఉంచితే చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రశంసల వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: