
కుటుంబ రాజకీయం : కొడుకును గెలిపించి.. తండ్రి ఓడిపోయాడు?
ఇక తెలంగాణలో కూడా కేసీఆర్ కుటుంబం ఏకంగా రాష్ట్రాన్ని ఏలేస్తుంది. అయితే ఇలా కుటుంబ రాజకీయాలలో భాగమైన వారిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఒకరు అని చెప్పాలి. తెలంగాణ రాజకీయాలలో సీనియర్ నాయకులలో ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకుని రాజకీయ వారసుడిగా ప్రజలకు పరిచయం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు అచ్చొచ్చిన మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో తాను కాకుండా కొడుకు రోహిత్ రావును నిలబెట్టాడు మైనంపల్లి.
తనకోసం కంటే ఎక్కువ కొడుకు కోసమే ప్రచారం నిర్వహించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఇలా కొడుకును నిలబెట్టాలి.. గెలిపించాలి అనే పట్టుదలను నిలబెట్టుకోగలిగిన మైనంపల్లి.. తాను మాత్రం గెలుపు అందుకోలేకపోయాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు రాజకీయ వారసుడు మైనంపల్లి రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి పద్మా దేవేందర్ రెడ్డిని ఓడించి మరి ఇక ఎమ్మెల్యేగా గెలిచారు. తన వాగ్దాటితో ప్రజల మనసులు తెలుసుకోగలిగారు. అయితే ఒకవైపు కొడుకు తరఫున ప్రచారం చేస్తూ ఇంకోవైపు తనకోసం ప్రచారం నిర్వహించుకున్న మైనంపల్లి మాత్రం.. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన ఎన్నికల్లో సైతం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు అని చెప్పాలి.