కుటుంబ రాజకీయాలు: 'అన్నయ్య' అట్టర్ ప్లాప్... 'తమ్ముడు' సూపర్ హిట్.!

frame కుటుంబ రాజకీయాలు: 'అన్నయ్య' అట్టర్ ప్లాప్... 'తమ్ముడు' సూపర్ హిట్.!

FARMANULLA SHAIK
* మెగాస్టార్ ను జీరో.. పవర్ స్టార్ ను హీరో చేసిన రాజకీయాల తీరు.!
* స్వతహాగా అన్న సైలెంట్.. తమ్ముడు వైలెంట్.!
* రాజకీయాల్లో పవన్ సక్సెస్ కి కారణం అదేనా.?
(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తర్వాత అంతటి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నస్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే మొదట గుర్తొచ్చే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.2008లో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించి రాజకీయాల్లోకి దిగారు. అప్పటికే రాజకీయ దిగ్గజాలు అయినటువంటి చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో తలపడి వారికీ ఎదురెళ్లడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా కూడా చిరంజీవి రిస్క్ చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగి భారీగా ఓటమి చవి చూసారు. కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించిన చిరంజీవి తర్వాతి రోజుల్లో పార్టీని నడపటం సులువు కాదని గ్రహించి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.తర్వాత రాజకీయాలు వేరు... సినిమా ప్రపంచం వేరు.. అనేలా మెగాస్టార్ మరల కంబ్యాక్ అంటూ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ తాను నమ్ముకున్న కళామ్మ తల్లీ ఒడిలో హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు.

మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకు పరిచయం అయ్యి కొద్దికాలంలోనే యూత్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న స్టార్ పవన్కళ్యాణ్.అయితే తన అన్నయ్య మెగాస్టార్ పార్టీ పెట్టి ఓడిపోయిన తర్వాత తన అన్నా సీఎం అవ్వాలనే కోరిక నెరవేరకపోవడంతో తానైనా సీఎం అవ్వాలన్న పట్టుదలతో రాజకీయా పార్టీ పెట్టాలని పవర్స్టార్ డిసైడ్ అయ్యారు.అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ 2014 మార్చి 10న ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేశారు. 2014 డిసెంబరు 11న ఎన్నికల సంఘం దీనిని ఆమోదించినది. 2019 ఎన్నికలలో పార్టీ పోటీ చేయటం దీనితో ఖారారు అయినది.2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా వ్యవస్థాపకుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాదు నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించాడు. ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించారు. రెండు గంటలకు పైగా చేసిన ప్రసంగంలో ఆయన తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు, విభజన జరిగిన తీరుపై ఆవేదన, పార్టీ విధానాలు వంటివి స్పష్టంగా వ్యక్తపరిచారు.
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ప్రధాన నినాదంగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. రాజకీయాల్లో నిలకడ లేమి, అవకాశవాదం, ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం వంటి వాటిని విమర్శించాడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసి ఓడిపోయారు తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి ఒక్కడే విజయం సాధించారు.ఆతర్వాత 2024 లో జనసేన జనం మనసును గెలుచుకొని జయకేతనం ఎగరవేసింది.తెలుగుదేశం ,భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. రాష్ట్రలో 21 చోట్లా గెలిచి సంచలనం సృష్టించింది.పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నట్లుగానే సంచలన విజయాన్ని నమోదు చేసింది.అధికార వైకాపా సాధించిన సీట్ల కంటే రెట్టింపు సీట్లు గెలిచింది.జగన్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 11 స్థానానికే పరిమితమైతే జనసేన 21 సీట్లలో పోటి చేసిన అన్నింట్లోనూ గెలిచి వందశాతం ఫలితం నమోదు చేసింది. శాసన సభలో తెలుగు దేశం తర్వాత అత్యధిక స్థానాలు న్న రెండో పార్టీగా జనసేన అవతరించింది.ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లతో జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించింది. మొదటి నుంచి సత్తా చూపిస్తున్న ఉభయగోదావరి,విశాఖ‌పట్నం జిల్లాల్లోనే కాకుండా ఉత్తరాంధ్ర,కృష్ణ ,గుంటూరు రాయలసీమ, జిల్లాల్లోనూ విజయం జనసేనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.ఎస్సీ,ఎస్టీ,రిజర్వుడు నియోజక వర్గాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది.పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,354 ఓట్ల మోజారిటీతో గెలిచిన జనసేన స్టార్ పవన్ కల్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పంచాయితీరాజ్ మరియు అటవీ శాఖా మాత్యులుగా కొనసాగుతున్నారు.ఆ విధంగా మెగాస్టార్ రాజకీయాంగా తాను సాధించలేని ఘనత తన తమ్ముడు కళ్యాణ్ బాబు సాధించడంతో సోదరాభావాన్ని ఆస్వాదిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: