వరంగల్: ఇద్దరు మంత్రులు సీనియర్సే.. కానీ పెత్తనమంతా మరో జిల్లా మంత్రిదట.!

frame వరంగల్: ఇద్దరు మంత్రులు సీనియర్సే.. కానీ పెత్తనమంతా మరో జిల్లా మంత్రిదట.!

Pandrala Sravanthi
ఉమ్మడి వరంగల్ జిల్లాలో  కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతుందట.  మొత్తం వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా హస్తం పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో  మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖలు  ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి, రేవుల ప్రకాష్ రెడ్డి,దొంతి మాధవరెడ్డి లు సీనియర్ నేతలు ఉన్నారు. ఇలా ఇంతమంది సీనియర్లు ఉన్న వరంగల్ జిల్లాలో పెత్తనం మాత్రం మరో జిల్లా నేతదని, ఆ నేతకే అన్ని రకాల సపోర్టు లభిస్తోందని చర్చ సాగుతోంది. మీ ఆ వివరాలు ఏంటో చూద్దామా. .

ఈ విధంగా వరంగల్ జిల్లాలో అంతా పెద్ద నాయకులే కనిపిస్తున్నప్పటికీ పెత్తనం మాత్రం పక్క జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికే ఉందట. ఆయన చెప్పేదాకా ఏ పని కూడా ముందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు చాలా ఫీల్ అవుతున్నారని  సమాచారం. కొన్నాళ్లపాటు వరంగల్ జిల్లాలో చక్రం తిప్పిన కొండా సురేఖ  మాట ప్రస్తుతం కాంగ్రెస్లో అంతగా చెల్లుబాటు అవ్వడం లేదని తెలుస్తోంది.  రేవంత్ రెడ్డి కింద కీలక మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండడంతో అంతేకాకుండా ఇన్చార్జి మంత్రిగా ఈయనే ఉండడంతో  ఏ పనులు చేయాలన్నా ఆయన అనుమతి తీసుకోకుండా ముందుకు వెళ్లే పరిస్థితి లేనట్టు తెలుస్తోంది. 

అలాగే చాలామంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు కూడా నిర్ణయాలు తీసుకునేందుకు  మంత్రి గారికి చెప్పాలని,  లేదంటే ఆ పని అక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోందని వారికి వారే చర్చించుకుంటున్నారట. గ్రేటర్ వరంగల్ అభివృద్ధిలో సురేఖ ప్రమేయం ఏ మాత్రం కనిపించడం లేదని  సమాచారం. ఈ విధంగా ఏ ఇద్దరు నేతలు కలిసినా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారని, ఒకవేళ  ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాబోవు రోజుల్లో రేవంత్ ప్రభుత్వానికి నష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: