బీజేపీలోకి జ‌గ‌న్‌... అందుకే అమిత్ షా తో సీక్రెట్‌గా ఇలా..?

frame బీజేపీలోకి జ‌గ‌న్‌... అందుకే అమిత్ షా తో సీక్రెట్‌గా ఇలా..?

RAMAKRISHNA S.S.
వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో గ‌త వారం రోజుల్లో రెండుసార్లు సమావేశం అయ్యారు . వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు అమిత్ షా తో బేటి అయ్యి .. ఆ ఫోటోలను గొప్పగా రిలీజ్ చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు అమిత్ షా తో ఫోటోలు దిగటం చాలా అవసరం అని చెప్పాలి. అయితే అమిత్ షా ఎందుకు ? ఆ ఛాన్స్ ఇస్తున్నారు అన్నది ఢిల్లీలో ఆసక్తికర చర్చలకు కారణం అవుతుంది. వైసిపి రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి టిడిపిలో చేరి మళ్ళీ ఆ పార్టీ తరపున గెలుస్తారని సాక్షి మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి అది వైసిపి కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారం అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ తనను తాను రక్షించుకునేందుకు సరికొత్త గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ రాజ్యసభ సభ్యులను స్వయంగా బిజెపిలోకి పంపటానికి జగన్ చేస్తున్న రాజకీయంలో భాగంగానే ఈ ప్రచారం జరుగుతుందని తెలుస్తోంది. ఆరుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ... అందుకే విజయ్ సాయి రెడ్డి అమిత్ షాను వారం రోజుల వ్య‌వ‌ధి లోనే రెండుసార్లు కలిశారని అంటున్నారు. ఈ ఐదారు గురు ఎంపీలకు బదులుగా జగన్ కొన్ని రాజకీయ ప్రయోజనాలు కూడా కోరుకుంటున్నారని టాక్ ? అందులో మొదటిది తన కేసులతో పాటు వివేక హత్య కేసు స్టేట స్ కో ఉండేలా చూడాలని అంటున్నారు.

అంటే తన కేసులు కదలకుండా ఉండాలని జగన్ మొదటి కోరిక కోరుతారట. అయితే దీనిపై బిజెపి స్పందన ఏమిటన్నది ? తెలియజేయలేదు. అయితే బిజెపికి రాజ్యసభలో బలం తక్కువగా ఉంది ... రాజ్యసభ ఎంపీల అవసరం ఉంది ... అందుకే బిజెపి ఏం చేస్తుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: