పొలిటికల్ ప్రేమలు: లేటు వయసులో ఘాటు ప్రేమ.. వరల్డ్ ఫేమస్ ఎన్టీఆర్ లవ్ స్టోరీ.!!

frame పొలిటికల్ ప్రేమలు: లేటు వయసులో ఘాటు ప్రేమ.. వరల్డ్ ఫేమస్ ఎన్టీఆర్ లవ్ స్టోరీ.!!

Pandrala Sravanthi
- లెక్చలర్ గా ఉన్న లక్ష్మి పార్వతిపై మనసు పడ్డ ఎన్టీఆర్..
- వేలాది మంది ముందు ప్రపోజ్ చేసిన ఎన్టీఆర్..
- ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతీ ప్రేమ ముందు అన్ని బలాదూర్..

సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో రాజకీయాల్లో సంచనాలు సృష్టించినటు వంటి మహాఘనుడు. అలాంటి ఎన్టీఆర్ చిత్రరంగంలో చేయని పాత్రలు లేవు. అలాంటి ఆయన పార్టీ స్థాపించి కేవలం సంవత్సరంలోపే అధికారంలోకి తీసుకు వచ్చినటువంటి గొప్ప నాయకుడు. అయితే ఎన్టీఆర్ రాజకీయరంగంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి గొప్ప నాయకుడు అయ్యాడు. ఇప్పటికీ ఈయనను ఆరాధించేవారు ఎంతోమంది ఉంటారు. అలా సినీ రాజకీయ రంగంలో ఎన్నో చరిత్రలు సృష్టించిన ఎన్టీఆర్ తన సొంత జీవితంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తన మేన మరదలు అయినటువంటి బసవతారకంను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వారికి పెళ్లిళ్లు జరిగిన తర్వాత ఆయనకు లక్ష్మీపార్వతిపై లవ్ పుట్టింది. లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నట్టు ఆమెను ప్రేమించి చివరికి పెళ్లి చేసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి లవ్ స్టోరీ గురించి కొన్ని వివరాలు చూద్దాం.
 లేటు వయసు ప్రేమ:
 సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో కొనసాగుతున్న తరుణంలోనే లెక్చరర్ గా పని చేసే లక్ష్మీపార్వతితో పరిచయం ఏర్పడింది. ఎదురుచూపులు కలిసి ప్రేమకు నాంది పలికింది.  1985లో మొదలైన వీరి ప్రేమకు పునాది రాయి పడి అలా కొనసాగుతూ వచ్చింది. ఇక అప్పుడప్పుడు కలవటం మాట్లాడుకోవడం వారి ప్రేమను వ్యక్తపరచడం జరుగుతూ వచ్చాయి. అప్పట్లో ఎవరికి సెల్ఫోన్ ఉండేది కాదు. ఈ తరుణంలో లక్ష్మీపార్వతి తో మాట్లాడాలని చెప్పి, లక్ష్మీపార్వతి కాలేజీలో ఫోన్ పెట్టించారు సీనియర్ ఎన్టీఆర్.  ఇదే తరుణంలో ఆయన మధ్యాహ్న సమయంలో లక్ష్మీపార్వతి తో మాట్లాడాలని చెప్పి కాలేజీ ల్యాండ్ లైన్ ఫోన్ కి కాల్ చేసేవారు. ఓ రోజు ఆయన ఫోన్ చేయగానే ప్రిన్సిపాల్ ఫోన్ ఎత్తి ఎన్టీఆర్ పేరు చెప్పగానే కిందపడిపోయారట.  ఆ తర్వాత లక్ష్మీపార్వతిని పిలిచి ఫోన్ ఇవ్వమని చెబితే ఆమెను పిలిపించి మాట్లాడమని చెప్పి ప్రిన్సిపాల్ బయటకు వచ్చారట. అలా ప్రతిరోజు లక్ష్మీపార్వతి కాలేజీకి వెళ్లడం క్లాసులు చెబుతున్న సమయంలో ఫోన్లు రావడం ఇలా మాట్లాడడం వీరి మధ్య లవ్ స్టోరీ చాలా జరిగింది. అలా ఒక రోజు లక్ష్మి పార్వతి  ప్రతిరోజు కాలేజీలో నేనుండడం మీరు ఫోన్ చేయడం బాగాలేదండి అని చెప్పిందట.

దీంతో ఎన్టీఆర్ ఢిల్లీ నుంచి స్పెషల్గా అప్పిల్ చేసి ఒక ఫోన్ తెప్పించి లక్ష్మీపార్వతి ఇంట్లో పెట్టించాడు. అలా ప్రతిరోజు లక్ష్మీపార్వతి కి ఫోన్ చేసి మాట్లాడుకునేవారు. లక్ష్మీపార్వతి తో ఫోన్ మాట్లాడిన బిల్లు ఆరోజుల్లోనే 3 లక్షల కి పైగా కట్టారట.ఈ పేపర్లను లక్ష్మీపార్వతికి చూపిస్తూ మన ప్రేమ విలువ మూడు లక్షల పైగానే దాటింది చూసావా అంటూ నవ్వుకుంటూ చెప్పారట. అలా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ తీరాలు దాటి  పెళ్లి దాకా దారితీసింది. ఒకరోజు వీరి మధ్య ఉన్నటువంటి లవ్ స్టోరీని మేజర్ చంద్రకాంత్  సినిమా 100 రోజుల ఫంక్షన్  తిరుపతిలో వేలాదిమంది జనాల మధ్య నిర్వహిస్తున్నారు.  ఈ సమయంలో లక్ష్మీపార్వతిని ప్రేమిస్తున్నానని చెబుతూ వేలాదిమంది ముందు ఆమెను పరిచయం చేశాడు. అలా వీరి మధ్య కొనసాగిన లవ్  చివరికి పెళ్లి దాకా వెళ్ళింది. అలా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుని ఆమెకు సపరేట్ లైఫ్ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ సొంత ఫ్యామిలీ నుంచి వ్యతిరేకత రావడంతో లక్ష్మీపార్వతిని వారి కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. అలా ఎన్టీఆర్ చనిపోయే వరకు లక్ష్మీపార్వతి ఆయన వెంట ఉంటూ ఎన్నో సఫర్యాలు చేసుకుంటూ వచ్చింది.  ఇప్పటికీ ఆమె ఆయన నామస్మరణే చేస్తుంది తప్ప మరో పేరు ఆమె నోట రాదు అంటే ఎన్టీఆర్ ను ఆమె ఎంతగా లవ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: