పొలిటిక‌ల్ ప్రేమ‌లు : ఖండాలు దాటిన రాజీవ్ గాంధీ ప్రేమ

frame పొలిటిక‌ల్ ప్రేమ‌లు : ఖండాలు దాటిన రాజీవ్ గాంధీ ప్రేమ

Veldandi Saikiran

* ఇటలీకి చెందిన సోనియాను ప్రేమించిన రాజీవ్‌
* ఇంగ్లాండ్‌ లో సోనియా-రాజీవ్‌ ప్రేమకు విత్తనం
* ఇండియా సాంప్రదాయాలకు సోనియా గ్రీన్‌ సిగ్నల్‌

భూమి పైన పుట్టిన ప్రతి జీవికి ప్రేమ అవసరం. ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ప్రేమ అనేది ఎదురవుతుంది. మగ అలాగే ఆడ ఇద్దరు కలిస్తేనే ప్రేమ అనేది చాలా తప్పు. తండ్రికి కొడుకు పైన ఉన్న  ఆప్యాయత కూడా ప్రేమనే. అలాగే ఓ తల్లికి కొడుకు పైన ఉన్న మచ్చిక కూడా అందమైన ప్రేమనే. రాజకీయ నాయకుల్లో కూడా..  కొంతమంది ప్రేమను పంచుకుంటారు. ప్రేమ వివాహాలు కూడా చేసుకుంటారు. అలాంటి వారిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఉన్నారు.
గాంధీ నేపథ్యం ఉన్న రాజీవ్ గాంధీ... సోనియా గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. రాజీవ్ గాంధీ ప్రేమ...  చాలా డిఫరెంట్. ఆయన ప్రేమఖండాలు దాటిపోయింది. సోనియాగాంధీని పెళ్లి చేసుకునే వరకు దూసుకు వెళ్ళింది. ఇటలీకి చెందిన సోనియా గాంధీని ప్రేమించి... అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు రాజీవ్ గాంధీ. 1968 సంవత్సరంలో... ఇటలీ దేశస్తురాలు అయిన సోనియా గాంధీని పెళ్లి చేసుకున్నాడు రాజీవ్ గాంధీ.
వాస్తవానికి 1968 కంటే ముందు ఇంగ్లాండ్ దేశంలోని కేం బ్రిడ్జి లో.. సోనియా గాంధీని రాహుల్ చూసాడట. అప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందట. ఇంకా ముందు వెంటనే ఇద్దరు ప్రపోజ్ చేసుకున్న తర్వాత.. పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అటు భారతదేశ కట్టుబాట్లకు.. కూడా సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇటు ఇందిరా గాంధీ కూడా రాజీవ్ గాంధీ వివాహానికి ఒప్పుకున్నారు.
ఈ తరుణంలోనే 1968 సంవత్సరంలో సోనియా గాంధీ మెడలో తాళి కట్టారు రాజీవ్ గాంధీ. ఇక రాజీవ్ గాంధీ... ఇండియాకు ఆరవ ప్రధానమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అకాల మరణం చెందారు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ మరణించడంతో.. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ  బాధ్యతలు తీసుకున్నారు. అలా వీరి జీవన కొనసాగింది. కాగా సోనియా గాంధీకి రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: