పొలిటిక‌ల్ ప్రేమ‌లు: సినిమాను తలపించేలా రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ?

frame పొలిటిక‌ల్ ప్రేమ‌లు: సినిమాను తలపించేలా రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ ?

Veldandi Saikiran

* కాలేజీలో ప్రేమలో పడ్డ గీత, రేవంత్
* రేవంత్ ను మర్చిపోవాలని గీత ఇంట్లో గొడవలు
* రేవంత్ పెళ్ళికి జైపాల్ రెడ్డితోనే రాయబారం


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చిన్న ఏజ్ లోని ఆ స్థాయికి ఎదిగారు. తన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో కొనసాగిన రేవంత్ రెడ్డి... తన ఎదుగుదల కోసం చాలా కష్టపడ్డారు. జడ్పిటిసి స్థాయి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదగడం రేవంత్ రెడ్డి కెరీర్ లో చాలా గొప్ప విషయం. అయితే అలాంటి... రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ కూడా చాలా అందంగా ఉంది.ఆయన కూడా.. ప్రేమ వివాహానికి మొగ్గు చూపారు.
పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ ప్రేమ వివాహంలో అనేక ట్విస్టులు కూడా ఉన్నట్లు వాళ్లే చాలాసార్లు చెప్పారు. 1969లో నాగర్ కర్నూలు జిల్లాలో జన్మించారు. అయితే ఆయన మొదటి నుంచి ఏబీవీపీ లీడర్ గా కొనసాగారు. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. అయితే అదే సమయంలో మాజీమంత్రి  కాంగ్రెస్ అగ్ర నేత జైపాల్ రెడ్డి తమ్ముడు కుమార్తె గీతారెడ్డి పైన...రేవంత్ రెడ్డి మనసు పారేసుకోవడం జరిగింది.
 ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకోవడంతో ప్రేమలో పడిపోయారు. అయితే ఈ విషయం గీతారెడ్డి నాన్నకు కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అయితే వాళ్ల వివాహానికి నిరాకరించి...  గీతారెడ్డిని ఢిల్లీలోని జైపాల్ రెడ్డి ఇంటికి పంపించారు. జైపాల్ రెడ్డితో కూడా... రేవంత్ రెడ్డి నే పెళ్లి చేసుకుంటానని గీత చెప్పడం జరిగింది. ఇక ఇదే అదునుగా చేసుకున్న రేవంత్ రెడ్డి...  రాయబారం పంపి జైపాల్ రెడ్డితో  పెళ్లికి ఒప్పించారట.
ఇక రేవంత్ రెడ్డి మొండితనం, కష్టపడే తత్వం గుర్తించిన జైపాల్ రెడ్డి పెళ్లికి కూడా ఒప్పుకున్నారట. వాళ్ళ కుటుంబంలో అందరికీ.. చెప్పి మరి... దగ్గరుండి గీత అలాగే రేవంత్ రెడ్డి వివాహం జరిపించారట జైపాల్ రెడ్డి. ఇలా అనేక ట్రస్టుల మధ్య రేవంత్ రెడ్డి వివాహం జరిగింది.  ఇక వీరిద్దరికీ ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లయి ఒక కొడుకు కూడా పుట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: