ఏపీ: సీఎం డిప్యూటీ సీఎంకు జోగయ్య లేఖ.. పట్టించుకుంటారా..?

frame ఏపీ: సీఎం డిప్యూటీ సీఎంకు జోగయ్య లేఖ.. పట్టించుకుంటారా..?

Divya
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమిలో భాగంగా టిడిపి ,జనసేన ,బిజెపి పార్టీలు అలయన్స్ ప్రకటించి ఒక్కటిగా ఎన్నికలలో నిలబడి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇలా కూటమి సమయంలో హరిరామ జోగయ్య నిత్యం వార్తలలో నిలుస్తూ ఉండేవారు. ఎన్నికలకు ముందు పవన్ ని తన లేఖ లతో ఎప్పుడు అలర్ట్ గా చేసేవారు. తాజాగా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఒక లేఖ ద్వారా కొన్ని విషయాలను తెలియజేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి రెండు నెలలు కావస్తూ ఉన్న వేళ టిడిపి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేసే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. మరికొన్ని పథకాలు ఈ ఏడాదికి రాలేవని..వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటూ కూడా తెలియజేశారు.. అలాగే టిడిపి సూపర్ సిక్స్ హామీలే కాదు కానీ జనసేన పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల పైన మాత్రం ఎవరు ఇప్పటివరకు మాట్లాడడం లేదు.. సరిగ్గా ఈ సమయంలోనే హరి రామ జోగయ్య కూడా స్పందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం పథకాలను కూడా అమలు చేయాలంటూ హరి రామ జోగయ్య లేఖలో రాశారు.

ఈ పథకాలతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా యువకులకు 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. ఈ పథకం పైన యువత చాలా ఆశలు పెట్టుకున్నారు. దీంతో జనసేన ఈ పథకాలను అమలు చేయాలి అంటూ జోగయ్య ఒక లేఖ ద్వారా ప్రస్తావించారు. మరి ఈ పథకాల పైన అటు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేకపోతే.. ఏం చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: