సుజ‌నా చౌద‌రి... బుద్ధా వెంక‌న్న వార్ బెజ‌వాడ‌ను వేడెక్కిస్తోందిగా..?

frame సుజ‌నా చౌద‌రి... బుద్ధా వెంక‌న్న వార్ బెజ‌వాడ‌ను వేడెక్కిస్తోందిగా..?

RAMAKRISHNA S.S.
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్లో అప్పుడే చాలా నియోజకవర్గాలలో కూటమిలోని మిత్రపక్షం పార్టీ నేతల మధ్య గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి. కొద్దిరోజులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకే కూటమిలో ఉన్న రెండు పార్టీలకు చెందిన కీలక నేతల మధ్య పోరు ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ ... కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలుపులో అన్ని పార్టీల కష్టం ఉంది. అయితే గెలిచి రెండు నెలలు కూడా కాలేదు ... అప్పుడే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం - బిజెపి నేతల మధ్య ఆధిపత్య పోరు కూటమి పార్టీలోని మూడో పార్టీల నేతలకు ఇబ్బందిగా మారింది. సుజనా చౌదరి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వారే.. ఆయనకు అక్కడ మంచి పరిచయాలు ఉన్నాయి.

అదే సమయంలో అక్కడ టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సైతం కీలక నేత.. వీరిద్దరూ మధ్య అంత సఖ్యత లేదని తెలుస్తోంది. తాజాగా బుద్ధా వెంకన్న తమ మధ్య గ్యాప్ లేదని ప్రకటించి ... అంతలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పెత్తనంతా ఎమ్మెల్యేలదే నడుస్తోంది. చివరకు సిఐల ట్రాన్స్‌ఫ‌ర్లు కూడా వాళ్ళు చెప్పిన వారికే అవుతున్నాయి .. పనులు కూడా వారు చెప్తేనే జరుగుతున్నాయి.. నేను ఐదేళ్ల పాటు క‌ష్ట‌ప‌డి 37 కేసులు పెట్టించుకున్నాను .. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను నా కేడర్ కూడా ఎంతో ఇబ్బంది పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి కూటమిలో వేరువేరు పార్టీల‌లో ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఇలాంటివి సహజమే..! అయితే ఇవి పెద్దవి కాకుండానే మొగ్గలోనే తుంచి వేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు .. లేకపోతే ఇవే ముదిరి పాకానపడి కూటమి ప్రభుత్వ పరువు బ‌జారు కీడుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: