సీఎం: జే.సీ.ఫ్యామిలీకి శుభవార్త చెప్పిన బాబూ.. ఆ పోస్ట్ ఆయనకే..!

frame సీఎం: జే.సీ.ఫ్యామిలీకి శుభవార్త చెప్పిన బాబూ.. ఆ పోస్ట్ ఆయనకే..!

Divya
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవి కోసం చాలామంది నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే ..ఇందులో టిడిపికి కంచుకోటగా మారిన తాడపత్రి నియోజకవర్గంలో కూడా జెసి దివాకర్ రెడ్డి కొడుకు జెసి పవన్ రెడ్డి కూడా ఈ పదవి కోసం ఆరాటపడుతున్నారు. ఇది కాస్త పక్కన పెడితే గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో మొత్తం వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించిన వారే ఉన్నారు అన్న వార్తలు వినిపించాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీఏ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. అందులో భాగంగానే జెసి ఫ్యామిలీ మెంబర్ అయిన జెసి పవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
నిజానికి ఈయనకు ఇంటర్నేషనల్ క్రికెట్లతో మంచి స్నేహం ఉంది.. పైగా కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ఏసీఏ కార్యవర్గం మొత్తం రాజీనామా చేశారు. ఈనెల నాలుగో తేదీన జరగబోయే సమావేశంలో వీరందరి రాజీనామాలు ఆమోదించి వెంటనే నూతన కార్యవర్గం కోసం చర్యలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది .అందులో భాగంగానే ఏసీఏ అధ్యక్షుడిగా పలువురి పేర్లు పరిశీలనలో ఉండగా జెసి పవన్ రెడ్డికే ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
అయితే నిన్నటి వరకు ఈ వార్తలు బాగా హల్చల్ చేశాయి. ఇదే సమయంలో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా ఆయనకు అవగాహన ఉంది మరొకవైపు ఎమ్మెస్ కే ప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈయనకు కూడా కూటమి లోని పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే  చర్చ తెరపైకి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి వైసిపి అభ్యర్థి తలారి రంగయ్య పై పవన్ రెడ్డి ఓడిపోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశాలు ఉన్నా, చివరి నిమిషంలో చంద్రబాబు బిసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు.  ఈ నేపథ్యంలోనే జెసి పవన్ రెడ్డికి మంచి అకామిడేషన్ చూపించాలనే ఆలోచన జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు జెసి పవన్ రెడ్డికి ఏసీఏ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి అయితే రాజకీయాలలో పదవి ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఏసీఏ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. చివరికి జెసి కుటుంబానికి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: