జగన్ ఎక్కువ చేస్తే దళితులంతా వైసీపీకి గుడ్ బై.. బైబై..?
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దళితులంతా తనకు ఏకపక్షంగా ఓట్లు వేస్తారని జగన్ భావించారు. అయితే జగన్ అంటే దళితులు తాము ఎంత వ్యతిరేక భావం ఉన్నామో ఓట్ల రూపం లోనే తీర్పు చెప్పారు. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆయన వ్యతిరేకంగా ఉండటం మరింత మైనస్ గా మారింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించకుండా మాజీ మంత్రి ... జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆదిమూలపు సురేష్ తో ఆయన ప్రెస్ మీట్ పెట్టించారు. అయితే ఈ ప్రెస్ మీట్ అనేక అనుమానాలు లేవనెత్తేలా ఉంది. వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తిస్థాయిలో స్వాగతించలేదు.
ఎప్పటిలాగే అడ్డగోలు వాదనతో రాజకీయం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పకనే చెబుతోంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేవారు ఇప్పుడు చాలా స్వల్పంగానే ఉన్నారు అని చెప్పాలి. మాల సామాజిక వర్గం కూడా గతంలోనే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం లేదు.. పైగా జనాభా దామాషా ప్రకారం ప్రాథినిత్యం దక్కాలని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పైన వైసిపి రాజకీయం చేయాలని చూస్తే దళిత వర్గాలు కూడా వైసిపికి జగన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ కుడితిలో పడిన ఎలుక మాదిరిగా కొట్టుకుంటున్న పరిస్థితి.