ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి, కలిపి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. మొత్తం 164 సీట్ల మెజారిటీతో అద్భుతమైనటువంటి సర్కారు ఏర్పాటు చేసింది. అంతేకాదు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి నేతగా ఈ కూటమి ప్రభుత్వమే ఏర్పడింది. వీరి సపోర్టుతోనే బిజెపి ప్రభుత్వ ఏర్పడిందని చెప్పవచ్చు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పీట వేస్తూ నిధులు కేటాయింపు జరుగుతుందని అందరూ భావించారు. కానీ అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ లో కేవలం 15వేల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేటాయింపు చేశారు.
దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ప్రస్తుతం కాంగ్రెస్ ఏపీ అధినాయకురాలు షర్మిల జగన్ ను గట్టిగా విమర్శిస్తూ టిడిపిని మెత్తగా విమర్శలు చేస్తోంది. ఇదే తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ అధికారులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో ఎస్సీ అధికారులు ఒక్కరు కూడా లేరని, జిల్లా కలెక్టర్ పోస్టింగులలో కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, టీటీడీలో కూడా ఎస్సీ అధికారులు లేకపోవడం బాధాకరమని అన్నారు.
పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ అధికారులు ఎక్కువగా ఉన్నారని, తమిళనాడు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిగా కూడా ఎస్సీ అధికారి రాబోతున్నారు. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు నిధులు కేటాయించామని మోడీ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈ మాటతో టిడిపి ప్రభుత్వం సంతోషపడుతుంది కానీ, ప్రపంచ బ్యాంకు అప్పు అనేది అమరావతికి అసలు ఇవ్వదని, అగ్రికల్చర్ ల్యాండ్స్ ని తీసుకొని డెవలప్మెంట్ చేసే వాటికి అసలు బ్యాంక్ కు అప్పు ఇవ్వకూడదని నిబంధన ఉందని చెప్పుకొచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను మీరు ఏ విధంగా నమ్మారు అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా టిడిపిని విమర్శిస్తోంది.