తూటాల్లాంటి మాటలతో రోజా పరువు తీసేసిన అనిత.. వీడియోలు డిలీట్ చేయించుకో అంటూ?
అయితే తూటాల్లాంటి మాటలతో రోజా పరువును వంగలపూడి అనిత తీసేశారనే చెప్పాలి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజా అలాంటి సినిమాలలో నటించారనే అర్థం వచ్చేలా చేసిన కామెంట్లు అప్పట్లో వివాదాస్పదం కాగా ఆ సమయంలో రోజాకు పలువురు సినీ సెలబ్రిటీలు మద్దతు ఇవ్వగా రోజా సైతం కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. రోజా కామెంట్ల గురించి అనిత గతంలో పదునైనా మాటలతో జవాబిచ్చారు.
రోజాకు తనవరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. తమపై రోజా విమర్శలు చేసిన సమయంలో ఆడదానిని అనే విషయం మరిచిపోయిందా? అంటూ విమర్శించారు. రోజా ఇతర నేతలపై చేసిన విమర్శలు చూసి తనను తాను పునఃసమీక్షించుకుంటే బాగుంటుందని ఆమె వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు దూషించినప్పుడు రోజా ఎక్కడ ఉన్నారని గతంలో అనిత కామెంట్లు చేశారు.
మహానటి రోజా నిన్న కార్చిన కన్నీరు అంతా డ్రామాయేనని ఆ ఏడుపు గ్లిజరిన్ ఏడుపు అని అనిత తెలిపారు. బండారు అన్న మాటల్లో నాకేమీ తప్పు అనిపించలేదని యూట్యూబ్‌లో రోజాకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని డిలీట్ చేయించుకుంటే బాగుండేదని అనిత సూచించారు. ఈ దేశంలో మహిళ అంటే కేవలం రోజానే అన్నట్లు ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారని అనిత విమర్శలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై సైతం రోజా విమర్శలు చేశారని అనిత చెప్పుకొచ్చారు.